AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21వ వసంతంలోకి హైదరాబాద్ రామకృష్ణ మఠం

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి గురువారంతో 127 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతకు నిరంతరం అందిస్తున్న...

21వ వసంతంలోకి హైదరాబాద్ రామకృష్ణ మఠం
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2020 | 9:38 PM

Share

Hyderabad Ramakrishna Math  : స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి గురువారంతో 127 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతకు నిరంతరం అందిస్తున్న ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ గురువారంతో 20 ఏళ్లు పూర్తి చేసుకొని.. 21వ వసంతంలోకి అడుగు పెట్టనుంది.

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ గత రెండు దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పరిపూర్ణత దిశగా యువతను మేల్కొలపడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ప్రత్యేక తరగతులతో యువతకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఇప్పటికే 20 లక్షల మందికి పైగా యువతకు శిక్షణనిచ్చి.. తీర్చిదిద్దిన వీఐహెచ్ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

వీఐహెచ్ఈ 21వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా జరగబోయే వర్చువల్ సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. విద్యార్థులను, యువతను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని రామకృష్ణ మఠ్ ఫేస్ బుక్, యూట్యూబ్ లింక్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో చూడొచ్చని రామకృష్ణ మఠం నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 10, 11 తేదీలలో రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

తొలి రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్ సమావేశంలో ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. బెంగళూరులోని వివేకానంద యోగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె. సుబ్రమణ్యం, హైదరాబాద్ వీఐహెచ్ఈ సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ విశ్వనాథం, ఓయూ సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ సుమిత్ రాయ్ చర్చించనున్నారు.