AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ప్రజాకవి కాళోజీ” బయోపిక్ ఓ సాహసం..

"ప్రజాకవి కాళోజీ" బయోపిక్ సినిమా తీయడమన్నది సాహసంతో కూడుకున్న ప్రక్రియని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్ నిర్మిస్తున్న "ప్రజాకవి కాళోజీ" బయోపిక్ సినిమాకు సంబంధించి బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి..

ప్రజాకవి కాళోజీ బయోపిక్ ఓ సాహసం..
Sanjay Kasula
|

Updated on: Sep 09, 2020 | 9:59 PM

Share

Biopic of Prajakavi Kaloji  : “ప్రజాకవి కాళోజీ” బయోపిక్ సినిమా తీయడమన్నది సాహసంతో కూడుకున్న ప్రక్రియని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్ నిర్మిస్తున్న “ప్రజాకవి కాళోజీ” బయోపిక్ సినిమాకు సంబంధించి బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ చీఫ్ గెస్ట్‌గా హాజరై కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత ప్రభాకర్ జైనీ  అభినందించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళోజీ గారి 106 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి సమర్పించే ఉద్దేశంతో ఒక వీడియో సాంగ్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. కాళోజీ తెలంగాణా చైతన్య స్ఫూర్తి… కళలకు కాణాచి అయిన వరంగల్ నుండి జయకేతనం ఎగురవేసి విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి అని పేర్కొన్నారు. తెలుగువారిలో సాహిత్య రంగంలో “పద్మ విభూషణ్” పొందిన ఏకైక వ్యక్తి కాళోజీ అని గుర్తు చేసుకున్నారు.

కాళోజీ నారాయ‌ణ‌రావుపై సీఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. అందుకే కాళోజీ పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించామని.. వరంగల్‌లో కాళోజీ స్మారక సభా మందిరం నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతీ సంవత్సరం కాళోజీ జన్మదినాన్ని “తెలంగాణా భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాని తెలిపారు. ప్రముఖ రచయితల‌ను కాళోజీ సాహితీ పురస్కారంతో సత్కరించుకుంటున్నామని పేర్కొన్నారు.