కాళోజీని స్మరించుకున్న వ్యవసాయవర్శిటీ..
ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. కవులు, కళాకారులు ప్రత్యేక నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం ప్రొఫెసర్ల బృందం ఆయనకు నివాళుర్పించింది.

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనాభవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపకులపతి డా. ప్రవీణ్‌రావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. రిజిస్ర్టార్ డా. ఎస్. సుదీర్‌కుమార్‌తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, బోదన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులు కాళోజీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కరోనా కారణంగా సామాజిక దూరంను పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అంతా కళోజీ కవితలను చదివి వినిపించారు కాలేజీ ఉపధ్యాయ బృంధం.