AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి మాడుపగిలే ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు వరుణుడి రాక తీవ్ర ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది.

Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
Hyderabad Rains
Anand T
|

Updated on: Jun 06, 2026 | 4:56 PM

Share

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు వరుణుడి రాక ఉపశమనాన్ని కలిగించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని ఖైరతాబాద్, టోలీచౌకి, కార్వాన్, రాజేంద్రనగర్, శంషాబాద్, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం, బంజారాహిల్స్, అత్తాపూర్, షేక్‌పేట్, బార్కాస్‌లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.

రోడ్లపై ట్రాఫిక్ జామ్

సాయంత్రం ఆఫీస్‌లు వదిలే సమయం కావడంతో వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. ఓ వైపు వర్షం, మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎమ్‌సీ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలవకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎక్కడైనా నీరు నిలిస్తే వెంటనే తొలగించేందుకు సిబ్బందిని రంగంలోకి దించారు.

జిల్లాల్లో వర్షాలు

ఇదిలా ఉండగా అటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ వాఖ తెలిపింది. అలాగే మెదక్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి – భోంగిర్, ఆదిలాబాద్, నిర్మల్‌లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
నోరూరించే స్పైసీ తోటకూర ఉల్లికారం.. 10 నిమిషాల్లో రెడీ
నోరూరించే స్పైసీ తోటకూర ఉల్లికారం.. 10 నిమిషాల్లో రెడీ
జాతకంలో గ్రహ దోషం అంటే ఏమిటి? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..
జాతకంలో గ్రహ దోషం అంటే ఏమిటి? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..
పేదోడి‌ సొంతిటి కల.. జస్ట్ 12 రోజుల్లో పూర్తి
పేదోడి‌ సొంతిటి కల.. జస్ట్ 12 రోజుల్లో పూర్తి
కనీసం ఒక్క డైలాగ్ చెప్పకుండానే స్టార్ నటి అయిన ముద్దుగుమ్మ..
కనీసం ఒక్క డైలాగ్ చెప్పకుండానే స్టార్ నటి అయిన ముద్దుగుమ్మ..
పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..
పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజే పతనం..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజే పతనం..
ఈ నటికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. భర్త చనిపోయాడని తెలిసినా..
ఈ నటికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. భర్త చనిపోయాడని తెలిసినా..
కొబ్బరికాయకు కుంకుమ ఎందుకు పెట్టరు? ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోండి
కొబ్బరికాయకు కుంకుమ ఎందుకు పెట్టరు? ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోండి
మహిళ ప్రాణం తీసిన లిఫ్ట్‌.. పిల్లలతో ఎక్కేటప్పుడు జాగ్రత్త..
మహిళ ప్రాణం తీసిన లిఫ్ట్‌.. పిల్లలతో ఎక్కేటప్పుడు జాగ్రత్త..