AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఈ నెల నుంచే అమల్లోకి.. వామ్మో.. ఒకేసారి ఎంతంటే..?

తెలంగాణలోని మందుబాబులకు కిక్కు దిగే వార్త. అదేంటంటే.. ఈ నెలలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఏఖంగా రూ.100కిపైగా పెరగనుందని తెలుస్తోంది. అసలే వేసవి కావడం, ఎండలు తగ్గుముఖం పట్టకపోవడంతో లిక్కర్ విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ధరలను పెంచితే అది మందుబాబులకు షాకే..

Telangana: భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఈ నెల నుంచే అమల్లోకి.. వామ్మో.. ఒకేసారి ఎంతంటే..?
Liquor
Venkatrao Lella
|

Updated on: Jun 06, 2026 | 2:50 PM

Share

తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్. మద్యం ధరలు భారీగా పెంచేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్దమైంది. ఒకేసారి 10 నుంచి 15 శాతం వరకు ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. మద్యం ధరలను పెంచాలని తయారీదారులు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకు తయారీ ఖర్చులు పెరిగిపోయాయని, ధరలను పెంచాలని సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా మడి సరకు ధరలు పెరగడంతో తయారీ కంపెనీలపై భారం పడింది. దీంతో ప్రభుత్వం కూడా పెంచేందుకు రెడీ అయింది. ఫుల్ బ్యాటిల్‌పై ఏకంగా రూ.120 వరకు ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ నెల 15 నుంచి కొత్త ధరలు..

ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మద్యం ధరలను సవరించడంపై ప్రభుత్వం జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ అధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవల మద్యం తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. అనంతరం ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. అయితే బీర్ల ధరలను మాత్రం పెంచడం లేదని తెలుస్తోంది. మిగతా మద్యం ధరలను పెంచడం వల్ల ప్రభుత్వానికి రూ.2400 నోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. వాస్తవ పరిస్థితులు ఆధారంగా ధరలను ఎంతవరకు పెంచాలనే దానిపై కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరలను పెంచారు.

ఏయే బ్రాండ్లపై ఎంతంటే..?

బ్రాండ్ల కేటగిరిని బట్టి ధరలు పెరగనున్నాయి. సాధారణ బ్రాండ్లకు సంబంధించి ఫుల్ బాటిళ్లపై రూ.80 వరకు పెంచనుండగా.. ప్రీమియం బ్రాండ్లపై రూ.90 వరకు పెంపు ఉండనుంది. ఇక కాస్ట్రీ బ్రాండ్లపై రూ.120 వరకు పెంపు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే బీర్ల ధరలను కూడా పెంచాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ గత ఏడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరలను పెంచారు. దీంతో ఇప్పుడు మరోసారి పెంచేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. దీంతో బీర్ల ధరలు ఎప్పటిలాగే ఉండనున్నాయి. బీర్ల ప్రియులకు ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. జూన్  15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయంటూ మద్యం సరఫరా చేసే డిస్టరీలు ఇప్పటినుంచే ప్రచారం చేస్తున్నాయి. దీంతో  ఈ నెలలో ఖచ్చితంగా పెంపు ఉండనుందని తెలుస్తోంది. మద్యం ధరలు పెరుగుతాయంటూ గత మూడు నెలలుగా ప్రచారం సాగుతోంది. మార్చిలో కమిటీని ప్రభుత్వం నియమించగా.. అప్పటినుంచి ధరల పెంపుపై వార్తులు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Follow Us