AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీలక పదవులు ఇచ్చిన పార్టీలను మోసం చేశారా? రాజకీయ చరమాంకంలో కడియం ఇబ్బందులు పడుతున్నారా ?

కీలక పదవులు ఇచ్చిన పార్టీలను మోసం చేశారా? రాజకీయ చరమాంకంలో కడియం ఇబ్బందులు పడుతున్నారా ?

Balaraju Goud
|

Updated on: Jun 06, 2026 | 4:24 PM

Share

టీవీ9 'క్రాస్ ఫైర్' ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై కీలక విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, గత ప్రభుత్వ అప్పుల భారంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదని పేర్కొన్నారు. తానూ సాంకేతికంగా తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

టీవీ9 ‘క్రాస్ ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై కీలక విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు ఉన్నాయని, గత ప్రభుత్వ అప్పుల భారంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందడం లేదని పేర్కొన్నారు. తానూ సాంకేతికంగా తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నా నియోజకవర్గాన్ని ఆశించినంత అభివృద్ధి చేయలేకపోయానని, అధికార పార్టీ సహకారం లేకపోతే ఏమీ చేయలేమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలపై స్పందిస్తూ. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అవుతుందని తాను అనుకోవడం లేదని, కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. అలాగే తెలంగాణలో బీజేపీ కూడా ప్రత్యామ్నాయం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తే అది కాంగ్రెస్‌కే లాభిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయలేమని, ఆయనకు మళ్లీ గెలిచే సత్తా ఉందని కడియం అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందిస్తూ, నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు బిడ్డగానే ప్రొజెక్ట్ అవుతున్నారని, కేటీఆర్ నాలెడ్జ్ వేరని, కేటీఆర్‌తో లోకేష్ సరితూగే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ చిరుగించే అవకాశం ఉందా? తెలంగాణలో దళితులకు రాజ్యాధికారం వచ్చేనా ? అనే మరిన్ని ముఖ్యాంశాలకు సంబంధించి టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడించారు మాజీమంత్రి కడియం శ్రీహరి. ఇంటర్వ్యూ ఫుల్‌ ఎపిసోడ్‌ ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది. వాచ్‌ ఆన్‌ టీవీ9..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jun 06, 2026 03:26 PM
Follow Us