AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: 1500కు పైగా సినిమాలు.. గిన్నిస్ బుక్‌లో స్థానం.. భర్త చనిపోయినా షూటింగ్ ఆపని ఈ దిగ్గజ నటి ఎవరంటే?

నాటకాలతో మొదలు పెట్టి సుమారు 1500కు పైగా సినిమాల్లో నటించారామె. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గానూ ఆ తర్వాత హీరో, హీరోయిన్లకు అమ్మగానూ, అమ్మమ్మగానూ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తన అభినయ ప్రతిభకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకున్నారు.

Actress: 1500కు పైగా సినిమాలు.. గిన్నిస్ బుక్‌లో స్థానం.. భర్త చనిపోయినా షూటింగ్ ఆపని ఈ దిగ్గజ నటి ఎవరంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 06, 2026 | 4:32 PM

Share

ప్రముఖ తమిళ దర్శకుడు పి. వాసు పేరు వినే ఉంటారు. రజనీకాంత్ చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించింది ఈ డైరెక్టరే.తమిళంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ సినిమాలు చేశారు. శ్రీహరితో పృథ్వీ నారాయణ, బాలకృష్ణతో మహారథి, విష్ణు, నాగార్జునలతో కృష్ణార్జున, వెంకటేష్ తో నాగవల్లి, రజనీకాంత్, జగపతిబాబులతో కథానాయకుడు వంటి సినిమాలు తీశారు వాసు. అలాగే తమిళంలో ఆయన తెరకెక్కించిన పలు సినిమాలు తెలుగులో రీమేక్ కూడా అయ్యాయి. అందులో విక్టరీ వెంకటేష్ నటించిన చంటి ఒరిజినల్ తమిళ్ వెర్షన్ చిన్నతంబి సినిమా కూడా ఒకటి. 1991లో రిలీజైన ఈ సినిమాలో ప్రభు, ఖుష్బూ హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక హృదయవిదారకర వార్తను దర్శకుడు పి. వాసు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిన్న తంబి చిత్రంలో హీరో తల్లి పాత్రలో దిగ్గజ నటి మనోరమ నటించారు. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ కు ఒక షాకింగ్ న్యూస్ అందిందంట. అదేంటంటే.. ఆ రోజు మధ్యాహ్నమే మనోరమ భర్త చనిపోయారట. దీంతో ఈ దుర్వార్త విని పి. వాసు షాక్‌ అయ్యారు. వెంటనే సినిమా షూటింగ్ ఆపేసి మనోరమను ఇంటికి పంపిద్దామని నిర్ణయించుకున్నారట. అయితే అక్కడ జరిగింది వేరు.

భర్త చనిపోయిన విషయం తెలిసినా మనోరమ ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదుట. తన బాధను మనసులోనే దాచుకుని కెమెరా ముందుకు వచ్చారట. దర్శకుడు మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లి ఇంటికి వెళ్లండి మేడమ్ అని చెప్పినా షూటింగ్ కొనసాగించారట మనోరమ. ‘సినిమా క్లైమాక్స్ కోసం పెద్ద సెట్ వేశారు, వంద లాది మంది ఆర్టిస్టులు వచ్చారు. నా సొంత విషాదం కోసం సినిమాకు నష్టం కలిగించలేను. నేను నా సీన్స్ పూర్తి చేసి ఇంటికి వెళతాను’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారట. ఈ విషయం గురించి పి. వాసు మాట్లాడుతూ.. సినిమా కోసమే బతుకుతున్నామని చాలా మంది చెప్పడం విన్నాను. కానీ ఆ రోజు నేను దాన్ని నిజ జీవితంలో చూశాను. భర్త చనిపోయిన విషయం యూనిట్ సభ్యులందరికీ తెలియకుండా మనోరమ చాలా అద్భుతంగా నటించారు. తన సీన్స్ పూర్తయి కెమెరా ఆపగానే ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. ఆ రోజు ఆమె అంకితభావాన్ని చూసి చిత్ర యూనిట్ సభ్యులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు డైరెక్టర్.

కాగా నటి మనోరమ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. అరుంధతి లాంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్, రజనీకాంత్, అన్నాదురై, కరుణానిధి తదితర సూపర్ స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ దిగ్గజ నటి 2015 అక్టోబర్ లో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి
Aachi Manorama

Aachi Manorama

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us