AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SP Balu : ఆ సింగర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది.. కానీ గుర్తింపు రాలేదు.. ఎస్పీ బాలు కామెంట్స్ వైరల్..

సినీ శ్రోతల హృదయాల్లో ఎప్పటికీ చెరగని రూపం ఎస్పీ బాలు. వందలాది పాటలతో సినీ సంగీతం ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం ఇండస్ట్రీలో తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

SP Balu : ఆ సింగర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది.. కానీ గుర్తింపు రాలేదు.. ఎస్పీ బాలు కామెంట్స్ వైరల్..
Singer Sp Balasubrahmanyam
Rajitha Chanti
|

Updated on: Jun 27, 2026 | 7:57 PM

Share

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలుసుబ్రహ్మణ్యం గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన పరిస్థితులను పంచుకున్నారు. తాను పాడటానికి సరిపోయే పాటలు అప్పుడు తయారు కావట్లేదని, తన వయసు కారణంగా తన గాత్రంపై ఒక అపోహ ఉందని ఆయన అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు తమ రేంజ్‌లో పాటలు పాడి ట్రాక్‌లు తీసేయడం వల్ల తనలాంటి సీనియర్ గాయకులకు ఇబ్బంది అవుతుందని బాలు తెలిపారు. ఇది తన శృతికి కష్టమవుతుందని, కొందరు బాలు పై శృతిలో పాడలేకపోతున్నారని అపప్రద కూడా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మంచి తెలుగు పాట వచ్చినప్పుడు, ఉచ్చారణకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు మాత్రమే తనను గుర్తు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

గాయకుల తరం మార్పుపై ఒక ప్రశ్న ఎదురైనప్పుడు, ఘంటసాల తర్వాత తాను బలంగా నిలబడినట్లుగా, ఇప్పుడు అలాంటి బలంగా ఉనికిని ఎస్టాబ్లిష్ చేసే గొంతులు రావట్లేదని ఒక అభిప్రాయం ఉందని, అయితే తాను దీనిని ఒప్పుకోనని బాలు అన్నారు. మంచి టాలెంట్ లేకపోలేదని, అయితే వారికి జనంలోకి వెళ్లే అవకాశాలు దొరకడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన కార్యక్రమంలో పాడి బయటకు వచ్చి సక్సెస్ అయిన శ్రీకృష్ణ వంటి యువ గాయకులు ఉన్నారని, కచేరీలలో కూడా తాను అతనితో పాడిస్తుంటానని బాలు పేర్కొన్నారు. తన దృష్టిలో శ్రీకృష్ణకు మంచి సింగర్ కావలసిన అన్ని పెరామీటర్స్ ఉన్నాయని, అతనికి కేవలం ఎక్స్‌పోజర్ మాత్రమే కావాలని బాలు చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

ప్లేబ్యాక్ సింగర్ నిర్వచనం గతంలో ఉన్నదానికి ఇప్పటికీ చాలా మారిందని ఎస్‌పీబీ వివరించారు. ఉదాహరణకు, లతా మంగేష్కర్ ఒకసారి ఈ అబ్బాయి గురించి మాట్లాడుతూ, వాడు థియరీ బాగా తెలుసు, బాగా పాడతాడు కానీ సినిమాకు ఒక నిర్వచనం ఉందని చెప్పారని గుర్తు చేసుకున్నారు. సినిమా చూస్తున్నప్పుడు అది వేరే ఎవరో పాడుతున్నట్లు ఉండకూడదని, ఎవరి మొహం కనపడితే ఆ పాత్ర నుండి గొంతు వస్తున్నట్లు ఉండాలని లతాజీ అన్నారని, కార్నర్ నుండి వస్తున్నట్లు ఉండకూడదని ఆమె అన్నారని బాలు తెలిపారు. ఇది ఒక వాయిస్‌కు తాను విన్న అత్యుత్తమ నిర్వచనమని బాలు అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

Follow Us