AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ వేదికపై సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అయితే ఈ సినిమాలో తన అమాయకపు చూపులతో, నటనతో అందరిని ఆకట్టుకున్న చిన్నారి గుర్తుందా.. ? మల్లీ పాత్రలో ఒదిగిపోయింది.

RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..
Rrr Movie Child Artist
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2026 | 9:14 AM

Share

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. బాహుబలి తర్వాత అదే స్థాయిలో బాక్సాఫీస్ షేక్ చేసిన మూవీ ఇది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా కీలకపాత్రలు పోషించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న రూపొందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగరాసింది. అలాగే ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, పాటలు మరింత హైలెట్ అయ్యాయి. ఇద్దరూ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో చూసి మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా మొత్తం ఒక చిన్నారి చుట్టూనే జరుగుతుంది. ఆ చిన్నారి పేరు మల్లి. బ్రిటీష్ దొరసాని గిరిజన గూడెంకు చెందిన ఈ చిన్నారిని తీసుకెళ్లి తన భవనంలో బంధిస్తుంది. దీంతో ఆ చిన్నారిని విడిపించేందుకు గిరిజన గూడెంకు చెందిన కొమురం భీమ్ (ఎన్టీఆర్) ఢిల్లీలో అడుగుపెట్టడం.. అక్కడే రామరాజు (చరణ్)తో స్నేహం ఏర్పడడం జరుగుతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, మల్లిని విడిపించడం.. ఆ తర్వాత రామరాజు కోసం కొమురం భీమ్ ఫైట్ చేయడం అంతా తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలకపాత్ర అంటే మల్లిదే. ఇందులో తన అమాయకపు చూపులతో.. సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది మల్లి. ఈ పాత్రలో కనిపించిన అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ట్వింకిల్. అంతకు ముందు ఈ చిన్నారి పలు యాడ్స్ చేసింది. ఇదిలా ఉంటే.. ట్రిపుల్ ఆర్ తర్వాత ట్వింకిల్ శర్మ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ పాప లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై సంవత్సరాలు గడుస్తున్నాయి. అప్పుడు అమాయకంగా కనిపించిన మల్లీ.. ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. గ్లామరస్ లుక్కులో మోడ్రన్ డ్రెస్సులలో ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ట్వింకిల్ లేటేస్ట్ లుక్స్ చూసి ఫ్యూచర్ హీరోయిన్.. ఏం మారింది భయ్యా.. వాటే మేకోవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఆర్ఆర్ఆర్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ లేటేస్ట్ ఫోటోషూట్..

View this post on Instagram

A post shared by t⭐️ (@_twinklesharmaa)

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us