శ్రీలంకన్ స్టైల్ చికెన్ కర్రీ.. రోటీల్లోకి సూపర్ కాంబో!
Prasanna Yadla
06 June 2026
Pic credit - Pinterest
శ్రీలంకన్ స్టైల్ చికెన్ కర్రీ ఇలా చేసి తింటే చపాతీ, రోటీల్లోకి అదిరిపోయే కాంబో అని చెప్పాలి
శ్రీలంకన్ స్టైల్ చికెన్ కర్రీ
చికెన్‌ను ముందుగా బాగా కడిగి దానికి కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఇంకా మిరియాల పొడితో 15 నిమిషాలు మ్యారినేట్ చేయాలి.
మిరియాల పొడితో చికెన్
ఆ తరవాత పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడి అయినా తరవాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి.
స్టెప్ -1
ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు ముక్కలు కూడా దీనిలో వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించాలి.
స్టెప్ -2
ఇక ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి.
స్టెప్ -3
ఆ తరవాత దీనిలో నాలుగు టమాటా ముక్కలు కూడా దీనిలో వేసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి.
స్టెప్ -4
ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, శ్రీలంకన్ కర్రీ పౌడర్ కూడా బాగా కలపాలి.
స్టెప్ - 5
ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు కూడా వేసి మసాలా పట్టేలా వేయించాలి. చివర్లో కొబ్బరి పాలు వేస్తే మెత్తగా ఉడికి మంచి రుచి వస్తుంది
స్టెప్ -6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి