Gold Prices: అబ్బబ్బా.. ఒక్కసారిగా బంగారం ధరలు ఢమాల్.. ఒక్కరోజే భారీగా పతనం.. ప్రస్తుతం ఎంతంటే..?
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కుప్పకూలుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గి సానుకూల ధోరణి ఉంది. ఈ కారణంగా ధరలు కూడా అదుపులో ఉంటున్నాయి.

బంగారం కొనుగోలు చేసేవారికి భారీ ఊరట దక్కింది. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దికాలంగా ధరలు పడిపోతూ వస్తోన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడటం, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు అదుపులోకి వస్తున్న క్రమంలో గోల్డ్ రేట్లపై వీటి ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులను బట్టి బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో యుద్దాలు, ఉద్రిక్తతలు తగ్గి సానుకూల వాతావరణం ఉండటంతో గోల్డ్ రేట్లు డౌన్ అవుతున్నాయి. శనివారం మరోసారి గోల్డ్ రేట్లు తగ్గాయి. అనంతరం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
గోల్డ్ రేట్లు ఇలా..
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,730 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కొరోజే ఏకంగా రూ.3 వేలు తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1.40 లక్షలుగా ఉంది. ఇవాళ ఒక్కరోజే రూ.2,750 తగ్గింది.
-హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,730 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1.40 లక్షల వద్ద ఉంది
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,910 వద్ద ఉండగా.. ఒక్కరోజే రూ.3050 తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1.42 లక్షలుగా ఉంది. శనివారం రూ.2300 పడిపోయింది
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,730గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,910 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,150 వద్ద ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.65 లక్షల వద్ద ప్రస్తుతం ఉంది. శుక్రవారం రూ.2.75 లక్షల వద్ద స్ధిరపడింది
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.70 లక్షల వద్ద ఉంది. నిన్న రూ.2.80 లక్షలుగా ఉంది. ఇవాళ రూ.10 వేలు తగ్గింది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.70 లక్షల వద్ద ఉంది. శుక్రవారం రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతోంది
