డార్క్ చాక్లెట్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే..
06 June 2026
Jyothi Gadda
సాధారణంగా చాక్లెట్లు అనగానే పళ్లకు కీడు చేస్తాయని, బరువు పెంచుతాయని అందరూ దూరంగా ఉంటారు. కానీ, అన్ని చాక్లెట్లు ఒకేలా ఉండవు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. వయసు పైబడటం వల్ల వచ్చే అల్జీమర్స్, డిమెంటియా వంటి మానసిక సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.
కంగారుగా లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది మూడ్‌ను వెంటనే మార్చి, మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తాయి. చర్మానికి తేమను అందించి, ముడతలు పడకుండా కాపాడతాయి. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
చాక్లెట్ అంటే బరువు పెరుగుతారని, ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది భావిస్తారు. అయితే, 70శాతం కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను పరిమితంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం.
రోజుకు 1 లేదా 2 చిన్న ముక్కలు (సుమారు 30-40 గ్రాములు) మాత్రమే తినాలి. అలాగే, కొనుగోలు చేసేటప్పుడు అందులో చక్కెర శాతం తక్కువగా, కోకో శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.