నా పిల్లి పోయింది.. వెతికిపెట్టండి..
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వింతైన కేసు నమోదైంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన పిల్లి అదృశ్యమైందని తిరుమలగిరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజేశ్వరి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి కారణమైన అతని చర్యలు తీసుకోవాలని, జీవహింస చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. రాజేశ్వరికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో పలు రకాల పెంపుడు జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటిలో ఒక పిల్లిని బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ […]
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వింతైన కేసు నమోదైంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన పిల్లి అదృశ్యమైందని తిరుమలగిరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజేశ్వరి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి కారణమైన అతని చర్యలు తీసుకోవాలని, జీవహింస చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. రాజేశ్వరికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో పలు రకాల పెంపుడు జంతువులు, పక్షులు ఉన్నాయి. వాటిలో ఒక పిల్లిని బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3లోని శ్రీనికేతన్‌కాలనీలో నివాసం ఉండే వ్యక్తికి ఈ నెల 13న ఫేస్‌బుక్ ద్వారా దత్తతకు ఇచ్చింది. కాగా.. ఈ నెల 20న పిల్లికి వ్యాక్సిన్ వేయించాల్సి ఉండటంతో అతడికి ఫోన్ చేసింది. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన రాజేశ్వరి ఇంటికి వెళ్లి అతన్ని నిలదీసింది. అది పారిపోయిందని అతడు చెప్పడంతో.. మనస్తాపానికి గురైన రాజేశ్వరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తన పిల్లిని అప్పగించాలని ఆమె కోరుతోంది.