తెలుగు రాష్ట్రాలో జోరుగా వర్షాలు
గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను దంచికొడుతున్నాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు అటు బొగ్గు ఉత్పత్తిపై వర్షాలు ప్రభావం చూపాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిన్న కురిసిన వర్షానికి సింగరేణి జీకేఓసీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చిత్తడి చిత్తడిగా మారిపోవడంతో ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 12 వేల […]
గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను దంచికొడుతున్నాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు అటు బొగ్గు ఉత్పత్తిపై వర్షాలు ప్రభావం చూపాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిన్న కురిసిన వర్షానికి సింగరేణి జీకేఓసీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చిత్తడి చిత్తడిగా మారిపోవడంతో ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని చోట్ల వరి చేలు నీట మునిగాయి. వర్షాలకు తోడు భారీగా ఊదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం మేఘాలు కమ్మేశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, లక్డికాపూల్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. రాబోయే రెండు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తామని మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.