AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా FSSAI కి ఫిర్యాదు చేయండి!

చాలామంది రెస్టారెంట్లలో నాణ్యత లేని, పాడైపోయిన లేదా కలుషితమైన ఆహారాన్ని గమనించినప్పుడు కేవలం అక్కడి సిబ్బందితో వాదించి వదిలేస్తుంటారు. కానీ, దీనిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) కి అధికారికంగా ఫిర్యాదు చేయడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వినియోగదారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారి ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ (Food Safety Connect) పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం.

రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా FSSAI కి ఫిర్యాదు చేయండి!
How To File Fssai Complaint
Jyothi Gadda
|

Updated on: Jul 13, 2026 | 8:19 PM

Share

స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో కలిసి బయట హోటల్స్ లేదా రెస్టారెంట్లలో తినడానికి వెళ్లినప్పుడు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆహారంలో వెంట్రుకలు రావడం, పురుగులు పడటం లేదా నిల్వ ఉంచిన పాడైపోయిన ఆహారాన్ని వడ్డించడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలామంది రెస్టారెంట్ మేనేజర్‌తో గొడవపడి, బిల్లు కట్టకుండా వచ్చేస్తుంటారు. కానీ, దీనివల్ల సమస్య ముగిసిపోదు. అదే రెస్టారెంట్ ఇతరుల ఆరోగ్యంతో కూడా ఆడుకునే ప్రమాదం ఉంది. అందుకే, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన హోటళ్లపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు (FSSAI) ఎలా ఫిర్యాదు చేయాలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. అదేలాగో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

FSSAI కి ఎలా ఫిర్యాదు చేయాలి? (స్టెప్-బై-స్టెప్ గైడ్):

ఆన్‌లైన్ పోర్టల్ సందర్శన:

వినియోగదారులు ముందుగా FSSAI అధికారిక లీగల్ అండ్ కంప్లైంట్ పోర్టల్ అయిన Food Safety Connect (foscos.fssai.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి వారి మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

వివరాల నమోదు:

పోర్టల్‌లోకి వెళ్ళిన తర్వాత కన్స్యూమర్ గ్రీవెన్స్ (Consumer Grievance) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.

రెస్టారెంట్ సమాచారం:

సదరు రెస్టారెంట్ పేరు, అది ఏ ప్రాంతంలో పూర్తి అడ్రెస్‌ డిటెల్స్‌ స్పష్టంగా పేర్కొనాలి. వీలైతే ఆ రెస్టారెంట్ FSSAI లైసెన్స్ నంబర్ బిల్లుపై ఉంటుంది తెలుసుకుని ఇవ్వడం మంచిది.

సాక్ష్యాలను జత చేయడం చాలా ముఖ్యం:

మీకు వడ్డించిన కలుషిత ఆహారానికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను తీసి అప్‌లోడ్ చేయాలి. అలాగే మీరు తిన్నదానికి రుజువుగా రెస్టారెంట్ ఇచ్చిన బిల్లు ఫోటోను తప్పనిసరిగా జత చేయాలి.

ఫిర్యాదు సమర్పణ:

సమస్యను క్లుప్తంగా వివరించి సబ్మిట్ బటన్ నొక్కాలి. ఫిర్యాదు నమోదైన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ లభిస్తుంది. దీని ద్వారా మీ ఫిర్యాదు ఏ దశలో ఉందో ట్రాక్ చేయవచ్చు.

యాక్షన్ ఎలా ఉంటుంది?:

మీరు ఫిర్యాదు చేసిన తర్వాత, స్థానిక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) సదరు రెస్టారెంట్‌ను స్వయంగా తనిఖీ చేస్తారు. అక్కడ ఆహార తయారీ విధానం, పరిశుభ్రత లోపించినట్లు గుర్తిస్తే ఆ రెస్టారెంట్‌కు భారీ జరిమానా విధించడమే కాకుండా, తీవ్రతను బట్టి వారి లైసెన్స్‌ను కూడా రద్దు చేసే అధికారం ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఉంటుంది. కాబట్టి, వినియోగదారులు తమ హక్కులను ఉపయోగించుకుని, ఇలాంటి సంఘటనలపై తక్షణమే స్పందించడం ద్వారా సమాజ ఆరోగ్య రక్షణలో భాగస్వాములు కావచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
యూఎస్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్!
యూఎస్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్!
కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!
కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!
లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?
లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?
నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై
పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై
రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి!
రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి!
కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్..!
కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్..!
పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న..
పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న..
'వెంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'వెంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఒక చేతిలో ఫోన్.. మరో చేతిలో నాగుపాము.. షాకింగ్ వీడియో!
ఒక చేతిలో ఫోన్.. మరో చేతిలో నాగుపాము.. షాకింగ్ వీడియో!