AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు? వాటిని కాపాడే చిన్న ఫార్ములా తెలుసా?

లక్షల టన్నుల బరువున్న క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, భారీ క్రూయిజ్ షిప్‌లు సముద్రంలో ఎందుకు మునిగిపోవు? ఆర్కిమిడీస్ సూత్రం, బ్యాలస్ట్ ట్యాంకులు, ప్రత్యేక డిజైన్ వంటి శాస్త్రీయ సూత్రాలు వాటిని ఎలా తేలేలా ఉంచుతాయో తెలుసుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, భారీ ఆయిల్ ట్యాంకర్ విశేషాలు తెలుసుకుందాం..

లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు? వాటిని కాపాడే చిన్న ఫార్ములా తెలుసా?
Big Giant Ships
SN Pasha
|

Updated on: Jul 13, 2026 | 8:26 PM

Share

సముద్రంలో లక్షల టన్నుల బరువున్న క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, వేలాది మంది ప్రయాణికులతో నిండిన భారీ క్రూయిజ్ షిప్‌లు ప్రశాంతంగా తేలుతూ ప్రయాణిస్తుంటే చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఇంత భారీ బరువు ఉన్న ఓడలు ఎందుకు మునిగిపోవు? వాటిని నీటిపై తేలేలా చేసే సాంకేతికత ఏంటి? అనే డౌట్స్ మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. అయితే దీనికి సమాధానం ఫిజిక్స్‌లోని ఆర్కిమిడీస్ సూత్రంలో దాగి ఉంది.

ఈ సూత్రం ప్రకారం.. నీటిలో ఉన్న ఏ వస్తువుపైనా అది స్థానభ్రంశం చేసిన నీటి బరువుకు సమానమైన పైకి ఎత్తే శక్తి (Buoyant Force) పనిచేస్తుంది. నౌక బరువు కంటే ఆ పైకి ఎత్తే శక్తి సమానంగా లేదా ఎక్కువగా ఉంటే ఆ నౌక నీటిపై తేలుతుంది. అందుకే లక్షల టన్నుల బరువున్న ఓడలు కూడా సముద్రంలో సురక్షితంగా ప్రయాణిస్తాయి. భారీ నౌకల రూపకల్పన కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. షిప్‌లు పూర్తిగా ఘన ఇనుముతో తయారు చేయరు. వాటి లోపలి భాగంలో పెద్ద మొత్తంలో ఖాళీ స్థలం, గాలి నిండిన కంపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. దీంతో మొత్తం నౌక సగటు సాంద్రత (Average Density) నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. అందుకే అవి నీటిపై తేలుతాయి. అదనంగా నౌక అడుగు భాగాన్ని వెడల్పుగా, లోతుగా రూపొందించడం వల్ల ఎక్కువ నీటిని స్థానభ్రంశం చేసి మరింత తేలే శక్తిని పొందుతుంది.

ఇది కూడా చదవండి: రైలు హారన్ ఊరికే పనిలేక కొట్టరు! అది సౌండ్ కాదు.. ఒక లాంగ్వేజ్! ఒక్క నిమిషంలో మీరూ నేర్చుకోవచ్చు

మోడ్రన్ షిప్స్‌లో బ్యాలస్ట్ ట్యాంకులు కూడా కీలక వ్యవస్థగా పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి ఈ ట్యాంకుల్లో సముద్ర నీటిని నింపడం లేదా బయటకు పంపించడం ద్వారా నౌక సమతుల్యతను నియంత్రిస్తారు. బలమైన గాలులు, అలలు లేదా సరుకు బరువు మారిన సందర్భాల్లో కూడా నౌక ఒరిగిపోకుండా ఈ వ్యవస్థ సహాయపడుతుంది. అలాగే అనేక వాటర్‌టైట్ కంపార్ట్‌మెంట్‌లు ఉండటం వల్ల ఒక భాగంలో నీరు చేరినా మొత్తం నౌక వెంటనే మునిగిపోకుండా రక్షణ లభిస్తుంది.

భారీ షిప్‌లు ఇవే..

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత భారీ క్రూయిజ్ షిప్‌గా రాయల్ కరేబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ది సీస్ గుర్తింపు పొందింది. ఈ నౌక బరువు సుమారు 2,48,663 టన్నులు. దాదాపు 365 మీటర్ల పొడవున్న ఈ నౌకలో సుమారు 7,600 మంది ప్రయాణికులు, 2,300 మందికి పైగా సిబ్బంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇందులో వాటర్ పార్కులు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్‌గా ఇప్పటికీ చరిత్రలో సీవైజ్ జెయింట్ ప్రసిద్ధి చెందింది. ఈ సూపర్ ట్యాంకర్ పూర్తి లోడ్‌తో సుమారు 6,57,000 టన్నుల డెడ్‌వెయిట్ సామర్థ్యాన్ని కలిగి ఉండేది. దీని పొడవు సుమారు 458 మీటర్లు, అంటే నాలుగు ఫుట్‌బాల్ మైదానాల కంటే ఎక్కువ. ప్రపంచంలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద ఓడగా ఇది గుర్తింపు పొందింది.

Follow Us