AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. ప్రపంచంలోనే అతిపెద్దది.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!

ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏది అని మీకు తెలుసా? ఈ పువ్వు ఒక మీటరు పొడవు వరకు పెరుగుతుంది..ఇది దాదాపు ఒక కారు టైరు పరిమాణంలో ఉంటుంది. ఇంతపెద్ద పుష్పం ఎంత అందంగా ఉంటుందో.. ఎంతటి సువాసనభరితంగా ఉంటుందో అనుకుంటే పొరపాటు పడినట్టే.. పువ్వులు వాటి సువాసనకు ప్రసిద్ధి చెందినప్పటికీ, దీని వాసన చూడాలంటే ధైర్యం కావాల్సిందే..పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. ప్రపంచంలోనే అతిపెద్దది.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
World's Largest Flower
Jyothi Gadda
|

Updated on: Jul 13, 2026 | 4:23 PM

Share

ప్రకృతి సృష్టిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. తన విశిష్టమైన అద్భుతాలతో మనల్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా పువ్వులు అనగానే మనకు ఆహ్లాదకరమైన రంగులు, సువాసనలు గుర్తొస్తాయి. కానీ, ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వుగా రికార్డు సృష్టించిన ఒక పుష్పం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ పువ్వు పరిమాణంలో కారు టైరు కంటే పెద్దదిగా ఉండటమే కాకుండా, శవం లాంటి భయంకరమైన దుర్వాసనను వెదజల్లుతుంది. ఈ వింత పుష్పం గురించిన కొన్ని షాకింగ్ నిజాలు ఇక్కడ తెలుసుకుందాం.

కారు టైరు కంటే పెద్దది, 10 కిలోల బరువు:

రఫ్లేషియా పువ్వులు సాధారణంగా ఇండోనేషియా, సుమత్రా, మలేషియాలోని దట్టమైన వర్షారణ్యాలలో కనిపిస్తాయి. పూర్తిగా వికసించిన రఫ్లేషియా పుష్పం వ్యాసం దాదాపు 3 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. దీని బరువు సుమారు 7 నుండి 10 కిలోల వరకు ఉంటుంది. దూరంగా చూస్తే ఒక పెద్ద కారు టైరు నేలపై పడి ఉన్నట్లుగా ఇది కనిపిస్తుంది.

ఆకులు, వేర్లు లేని వింత మొక్క:

ఈ మొక్కకు సాధారణ మొక్కల్లాగా ఆకులు, కాండం లేదా వేర్లు ఏవీ ఉండవు. ఇందులో క్లోరోఫిల్ లేనందున ఇది సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. అందువల్ల, ఇది అడవుల్లోని ఇతర తీగ మొక్కలపై ఆధారపడి జీవించే ఒక పరాన్నజీవి. ఈ మొక్కకు సంబంధించిన ఏ భాగమూ వెలుపల కనిపించదు. కేవలం మొగ్గ దశకు చేరుకున్నప్పుడు మాత్రమే అది తీగలను చీల్చుకుని బయటకు వచ్చి, ఒకే ఒక పెద్ద పువ్వుగా వికసిస్తుంది.

ఇవి కూడా చదవండి

శవం లాంటి దుర్వాసన – కారణం ఏంటి?:

రఫ్లేషియా పువ్వు వికసించినప్పుడు దాని నుండి కుళ్ళిపోయిన మాంసం లేదా శవం లాంటి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అందుకే స్థానికులు దీనిని శవం పువ్వు అని పిలుస్తారు. ఈ దుర్వాసన వెనుక ఒక ప్రకృతి రహస్యం ఉంది. ఈ వాసనకు ఆకర్షితమై ఈగలు, కీటకాలు పువ్వు వైపు వస్తాయి. ఆ కీటకాల ద్వారానే ఈ పుష్పంలో పరాగసంపర్కం జరిగి, దాని వంశవృద్ధి సాగుతుంది.

కేవలం కొన్ని రోజులు మాత్రమే బతుకుతుంది:

ఈ పువ్వు మొగ్గ నుండి పూర్తిగా వికసించడానికి దాదాపు 9 నెలల సుదీర్ఘ సమయం పడుతుంది. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అంత పెద్దగా వికసించిన ఈ పువ్వు కేవలం 5 నుండి 7 రోజులు మాత్రమే బతికుంటుంది. ఆ తర్వాత అది నల్లగా ముడుచుకుపోయి, కుళ్ళిపోయి నేలలో కలిసిపోతుంది. ప్రస్తుతం అడవులు అంతరించిపోతుండటంతో ఈ అరుదైన రఫ్లేషియా జాతి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us