ప్రోటీన్ పుష్కలంగా ఉండే వెజిటేబుల్ ఆమ్లెట్.. ఎలా చేయాలంటే?
Samatha
13 July 2026
ఆరోగ్య మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి.
ఆరోగ్య మహాభాగ్యం
కానీ చాలా మంది ఉరుకుల పరుగుల జీవితంలో, సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఆరోగ్యంపై కూడా అంతగా శ్రద్ధ తీసుకోవడం లేదు.
లైఫ్ స్టైల్
కాగా, ఇప్పుడు మనం మంచి ప్రోటీన్ ఉండే వెజిటేబుల్ ఆమ్లేట్ చాలా సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం,
వెజిటేబుల్ ప్రోటీన్
2 గుడ్లు 2 టేబుల్ స్పూన్ల తరిగిన ఉల్లిపాయ 2 టేబుల్ స్పూన్ల తరిగిన టమాటో 2 టేబుల్ స్పూన్ల తరిగిన క్యాప్సికమ్ 1 తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ¼ టీస్పూన్ నల్ల మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు 1 టీస్పూన్ నూనె
పదార్థాలు
పాన్‌లో నూనె వేడి చేసి అన్ని కూరగాయలు ,ఉప్పు వేసి 1 నిమిషం వేగించండి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 గుడ్లను ఒక బౌల్‌లో కొట్టి, ఉప్పు,కొంచెం నీళ్లు వేసి బాగా గిలకొట్టండి.
తయారు చేసుకోవాల్సినవి
పాన్‌లో కొంచెం నూనె వేసి, గుడ్డు మిశ్రమం పోసి పాన్ తిప్పి అన్ని వైపులా పరవండి. కింద భాగం ఉడికే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి.
గుడ్డు మిశ్రమం
తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు అన్నీ వేసి మంచిగా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత దానిని ప్లేట్‌లోకి తీసుకోవాలి.
పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు
దీని తర్వాత ఆమ్లెట్‌ను ప్లేట్‌లోకి తీసి, ఒక వైపు కూరగాయల స్టఫింగ్ పెట్టి రోల్ చేయండి. సగానికి కట్ చేసి వేడిగా వేడిగా తింటే రుచి అదిపోద్దీ.