వంటల రుచి డబుల్ అవ్వాలా.. కొత్తిమీర ఆకులు కాదు..కాడలు వేయాల్సిందే..

13 July 2026

Krishna

కొత్తిమీర ఆకులతో పోలిస్తే దాని కాడల్లో సుగంధ భరితమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వంటకాలకు అద్భుతమైన ఫ్లేవర్‌ను, రెట్టింపు రుచిని అందిస్తాయి. కానీ చాలా మంది వాటిని పారేస్తారు.

అద్భుతమైన సువాసన

కొత్తిమీర కాడలు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, జీర్ణక్రియను మెరుగుపరిచే పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి.

విటమిన్లు, ఫైబర్ నిధి

మనం ఇంట్లో కొత్తిమీర లేదా పుదీనా చట్నీలు తయారుచేసేటప్పుడు ఆకులతో పాటు ఈ కాడలను కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది చట్నీకి మంచి చిక్కదనాన్ని, గాఢమైన రుచిని ఇస్తుంది.

రుచి అమోఘం

వెజిటెబుల్ సూప్ లేదా చికెన్ సూప్ లాంటివి తయారుచేసేటప్పుడు.. కొత్తిమీర కాడలను దంచి లేదా సన్నగా తరిగి అందులో వేయాలి. ఇవి సూప్‌ మరిగేటప్పుడు మంచి సువాసనను ఇస్తాయి.

సూప్‌లకు స్పెషల్ ఫ్లేవర్

చికెన్, చేపలు లేదా పనీర్ లాంటి వంటకాలను మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఈ కొత్తిమీర కాడలను కూడా మెత్తగా నూరి వేసుకోవాలి.

మ్యారినేషన్‌లో సూపర్

ఈ కాడల పేస్ట్‌ను మ్యారినేషన్‌లో వాడటం వల్ల, మసాలాల రుచి ముక్కల లోపలి వరకు చాలా బాగా చేరుతుంది. అందుకు నాన్ వెజ్ మ్యారినేట్ చేసేటప్పుడు ఈ కాడలను తప్పక ఉపయోగించడం మంచిది.

మసాలా రుచి

మ్యారినేషన్‌లో కొత్తిమీర కాడల పేస్ట్‌ను వాడిన చికెన్ లేదా పనీర్‌ను ఫ్రై చేసినా, లేదా గ్రిల్ చేసినా వాటి టెక్స్చర్, టేస్ట్ హోటల్ స్టైల్‌లో అద్భుతంగా వస్తాయి.

వంటకాలకు పర్ఫెక్ట్

మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చిన ప్రతిసారీ కాడలను పారేసే అలవాటు ఉంటే ఈరోజే మార్చుకోండి. ఈ చిట్కాలను పాటించి మీ వంటల రుచిని, ఆరోగ్యాన్ని పెంచుకోండి.

పారేయకండి