AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్.. సీసీటీవీ విజువల్స్‌తో బయటపడ్డ అసలు యవ్వారం!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ప్రమేయం ఉన్న ఈ బైక్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్.. సీసీటీవీ విజువల్స్‌తో బయటపడ్డ అసలు యవ్వారం!
Kasibugga Bike Accident Case
Balaraju Goud
|

Updated on: Jul 13, 2026 | 8:11 PM

Share

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ప్రమేయం ఉన్న ఈ బైక్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మొదట ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

కాశీబుగ్గ పరిధిలోని కోసంగిపురం జంక్షన్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృత్యువాత పడ్డాడు. అయితే, ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రాజకీయ వర్గాల అండతో అసలు నిందితుడిని తప్పించే డ్రామా మొదలైంది. సీదిరి అప్పలరాజు ముఖ్య అనుచరుడి కుమారుడైన సిద్ధార్థ్ అనే యువకుడు.. తానే యాక్సిడెంట్ చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు కూడా అతనికి త్వరితగతిన స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు.

కానీ, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసలు కథ అడ్డం తిరిగింది. ఆ విజువల్స్‌ను నిశితంగా పరిశీలించినప్పుడు బైక్ నడిపింది సిద్ధార్థ్ కాదు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అని స్పష్టమైంది. దీంతో తప్పు దొరికిపోవడంతో చేసేదేమీ లేక ఆరవ్ స్వయంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది.

ఈ వ్యవహారంపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కుమారుడిని కాపాడుకోవడం కోసం ఒక దళిత గొర్రెల కాపరి ప్రాణాన్ని, అలాగే తన సొంత అనుచరుడి కుమారుడి భవిష్యత్తును సీదిరి పణంగా పెట్టారని మండిపడ్డారు. తప్పుడు వ్యక్తిని నిందితుడిగా సృష్టించడమే కాకుండా, బాధితుడి కుటుంబంతో రాజీ పడటానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి మరొక నేరానికి పాల్పడటం తీవ్రమైన క్రైమ్ కిందకే వస్తుందని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముందుగా అనుకున్నట్లుగా డీల్ కుదరకపోవడం వల్లే ఈ సీసీటీవీ కథ ఆలస్యంగా తెరపైకి వచ్చిందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఒకవేళ లోపాయికారీ ఒప్పందం అనుకున్నట్లు జరిగి ఉంటే.. అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటపడేదే కాదని, అధికార/రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు కేసును తారుమారు చేయాలని చూశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us