AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్‌లో ఇరాన్ భీకర దాడి.. అమెరికా ‘పేట్రియాట్ వాయు రక్షణ వ్యవస్థల’ను ముక్కలు చేసిన ఇరాన్ డ్రోన్లు!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాలలో మోహరించిన అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సోమవారం (జూలై 13) భారీ దాడులకు తెగబడింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లలోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన ఒక కీలక వైమానిక స్థావరం తీవ్రంగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

గల్ఫ్‌లో ఇరాన్ భీకర దాడి.. అమెరికా ‘పేట్రియాట్ వాయు రక్షణ వ్యవస్థల’ను ముక్కలు చేసిన ఇరాన్ డ్రోన్లు!
Patriot Air Defense System
Balaraju Goud
|

Updated on: Jul 13, 2026 | 8:33 PM

Share

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాలలో మోహరించిన అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సోమవారం (జూలై 13) భారీ దాడులకు తెగబడింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లలోని అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన ఒక కీలక వైమానిక స్థావరం తీవ్రంగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘నూర్ న్యూస్’ ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా దళాలు చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ‘కంటికి కన్ను’ (Eye for an Eye) పేరుతో ఈ సైనిక చర్యను ప్రారంభించారు. దాదాపు 48 గంటల పాటు శత్రువుల కదలికలను నిశితంగా పర్యవేక్షించిన అనంతరం ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ ఈ దాడులను మూడు వ్యూహాత్మక దశల్లో పూర్తి చేసింది.

మొదటి దశగా ఇరాన్ బలగాలు తొలుత జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. ఈ క్రమంలో అక్కడి అమెరికా ట్రాకింగ్ వ్యవస్థలను, రక్షణ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిలిపివేశాయి. రెండవ దశలో జోర్డాన్ తర్వాత బహ్రెయిన్‌లోని ప్రముఖ ‘షేక్ ఇసా’ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. మూడో దశలో కువైట్‌లోని అమెరికా సైనిక ఆస్తులను ఇరాన్ కోలుకోలేని దెబ్బతీసింది. ఇక్కడి ‘అలీ సలేం’ ఎయిర్ బేస్‌పై దాడి చేసి అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక ‘పేట్రియాట్ వాయు రక్షణ వ్యవస్థలను’, భారీ ఇంధన ట్యాంకులను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అలాగే ‘అహ్మద్ అల్ జాబెర్’ బేస్ వద్ద ఉన్న ఎఫ్‌పీఎస్ (FPS) రాడార్ వ్యవస్థను కూడా ముక్కలు చేసింది.

ఈ దాడులతో పాటు హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా నౌకల రాకపోకలు, జోక్యాన్ని ఎంతమాత్రం సహించబోమని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ దాడుల తీవ్రత, అమెరికా సైన్యానికి జరిగిన నష్టంపై పెంటగాన్ లేదా అంతర్జాతీయ వర్గాల నుండి ఇంకా పూర్తిస్థాయి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!