AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంచ్ బ్యాగ్ నుండి మొండి మరకలు, దుర్వాసనలను వదిలించే సింపుల్ హోమ్ టిప్స్!

ఉద్యోగులైనా, పాఠశాల విద్యార్థులైనా ప్రతిరోజూ లంచ్ బ్యాగ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, తరచూ కూరలు లేదా నూనె పదార్థాలు బ్యాగ్‌లో చిందిపోవడం సర్వసాధారణం. చాలామంది కేవలం పైపైన తుడిచి వదిలేస్తుంటారు. దీనివల్ల కాలక్రమేణా బ్యాగ్ లోపలి మూలల్లో మురికి పేరుకుపోయి, బ్యాక్టీరియా చేరడమే కాకుండా ఒక రకమైన వాసన రావడం మొదలవుతుంది. మీ లంచ్ బ్యాగ్‌ని సరికొత్తగా, పరిశుభ్రంగా మార్చడానికి ఉపయోగపడే కొన్ని సులభమైన డీప్ క్లీనింగ్ చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

లంచ్ బ్యాగ్ నుండి మొండి మరకలు, దుర్వాసనలను వదిలించే సింపుల్ హోమ్ టిప్స్!
How To Clean A Lunch Bag
Jyothi Gadda
|

Updated on: Jul 13, 2026 | 5:52 PM

Share

మనం రోజూ ఆఫీసులకు లేదా పాఠశాలలకు తీసుకెళ్లే లంచ్ బ్యాగ్‌లలో ఆహార పదార్థాలు చిందిపోవడం వల్ల మొండి మరకలు, అసహ్యకరమైన దుర్వాసనలు ఏర్పడుతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే బ్యాక్టీరియా చేరి అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకే, లంచ్‌ బాక్స్‌లను మాత్రమే కాదు.. బ్యాగ్‌లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోనే లంచ్ బ్యాగ్‌లను సులభంగా శుభ్రం చేసుకునే సింపుల్‌ టిప్స్‌ కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల లంచ్ బ్యాగ్‌లు మరకలు లేకుండా శుభ్రపడటమే కాకుండా, ఎల్లప్పుడూ సరికొత్తగా, సువాసనతో మారుతాయి.

బేకింగ్ సోడా మ్యాజిక్:

లంచ్ బ్యాగ్‌లో వచ్చే ఎలాంటి దుర్వాసననైనా తొలగించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాగ్ లోపల కొద్దిగా బేకింగ్ సోడా పొడిని చల్లి, రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం దాన్ని దులిపేసి, తడి గుడ్డతో తుడిస్తే దుర్వాసనలన్నీ మాయమవుతాయి. ఒకవేళ మొండి మరకలు ఉంటే, బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి, మరకలపై రుద్ది 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

వెనిగర్, వాటర్ స్ప్రే:

వైట్ వెనిగర్‌లో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఒక స్ప్రే బాటిల్‌లో సమాన భాగాలుగా నీరు, వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని లంచ్ బ్యాగ్ లోపల, బయట స్ప్రే చేసి, కాసేపటి తర్వాత మెత్తని గుడ్డతో శుభ్రంగా తుడవండి. ఇది బ్యాగ్‌లోని జిడ్డును వదిలించడమే కాకుండా క్రిములను సంహరిస్తుంది.

ఇవి కూడా చదవండి

డిష్ వాషింగ్ లిక్విడ్, బ్రష్ క్లీనింగ్:

ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ కలపండి. ఇప్పుడు ఒక పాత టూత్ బ్రష్‌ను ఆ నీటిలో ముంచి, లంచ్ బ్యాగ్ జిప్పర్లు, మూలలు, కుట్లు ఉన్న చోట బాగా రుద్దండి. ఇక్కడే ఎక్కువ ఆహార కణాలు దాగి ఉంటాయి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో తుడిచేయాలి.

ఎండలో ఆరబెట్టడం ముఖ్యం:

లంచ్ బ్యాగ్‌ను శుభ్రం చేసిన తర్వాత దానిని లోపలి వైపు బయటకు తిప్పి, గాలి తగిలేలా బాగా ఆరబెట్టాలి. వీలైతే కొంతసేపు ఎండలో ఉంచడం ద్వారా మిగిలి ఉన్న తడి, బ్యాక్టీరియా, వాసనలు పూర్తిగా తొలగిపోతాయి. బ్యాగ్ పూర్తిగా ఆరిన తర్వాతే మళ్లీ వాడాలి. వారానికి కనీసం ఒక్కసారైనా లంచ్ బ్యాగ్‌లను ఈ పద్ధతిలో డీప్ క్లీన్ చేయడం వల్ల ఆహార భద్రత పెరుగుతుంది. మీ పిల్లల, మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us