AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరాశివారికి శుభ ఘడియలు.. ఉగాది రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (02.04.2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు.

Horoscope Today: ఈరాశివారికి శుభ ఘడియలు.. ఉగాది రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Apr 02, 2022 | 6:35 AM

Share

Horoscope Today (02.04.2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన (ఏప్రిల్‌ 02వ తేదీ ) శనివారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి

శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో అనవసరంగా ఇతరులతో మాటలు పడాల్సి వస్తుంది. అయినా సహనంతో ముందుకు వెళ్లాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. లక్ష్మీ సహస్రనామం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా జాగ్రత్తపడాలి. గణపతి సహస్రనామ పారాయణం చేస్తే శుభం కలుగుతుంది.

మిథున రాశి

ఈరాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

కర్కాటక రాశి

ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలు, వ్యవహారాలకు సంబంధించి ఇంటి పెద్దలు, కుటుంబ సభ్యులను కలుస్తారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు ఒక కొలిక్కి వస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే మంచి కలుగుతుంది.

సింహ రాశి

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సహనంలో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల నుంచి తగిన సహకారం అందుతుంది. శివుడిని పూజించడం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు ఎదుర్కొంటారు.

కన్యరాశి

ప్రారంభించబోయే పనుల్లో ముందస్తు ప్రణాళికలు పాటించడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు. అయితే కొన్ని కీలకమైన పనులను మరికొన్ని రోజులు వాయిదా వేయడమే మంచిది. అరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.

తుల రాశి

ఈరాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదేవతలను ఆరాధించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి

సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలోనూ మంచి లాభాలను అందుకుంటారు. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి

శ్రమకు తగ్గ ఫలితాలు అందుకుంటాయి. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. తప్పుదారి పట్టించేవారిని దూరం పెట్టాలి. సాయినామాన్ని జపించడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు.

మకర రాశి

ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సహకారం వల్ల మేలు కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి కలుగుతుంది.

కుంభ రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరమేశ్వరుడిని ప్రార్థించడం వల్ల మేలు జరుగుతుంది.

మీన రాశి

పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. డబ్బు విషయంలో పొదుపు పాటించాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. శత్రువల విషయంలో పైచేయి సాధించినా అప్రమత్తంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also read:Ugadi-Tirumala: ఉగాదికి ముస్తాబైన తిరుమల.. నేడు శ్రీవారి ఆలయంలో ఆస్థానం.. పంచాంగ శ్రవణం.. ఆ సేవలు రద్దు

Mobile Using Effects: అతిగా మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారా? ఈ షాకింగ్ సమాచారం మీకోసమే..!

Dry Fruits: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పనిసరిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.. ఎందుకంటే