HIT Movie Review: హిట్ మూవీ రివ్యూ..

బ్యానర్‌: వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణ: నాని నటీనటులు: విశ్వక్‌సేన్‌, రుహానీ శర్మ, మురళీశర్మ, బ్రహ్మాజీ, హరితేజ, చైతన్య తదితరులు నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని రచన: డా.శైలేష్‌ కొలను కెమెరా: మణికందన్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ ఆర్ట్: అవినాష్‌ కొల్ల ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.వెంకటరత్నం (వెంకట్‌) స్టంట్స్: నభ సెన్సార్‌ సర్టిఫికెట్‌: యు/ఎ విడుదల: 28.02.2020 విక్రమ్‌(విశ్వక్‌సేన్‌) హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ లో పనిచేస్తుంటాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అతనికి బీపీ అమితంగా […]

HIT Movie Review: హిట్ మూవీ రివ్యూ..
Follow us

|

Updated on: Feb 28, 2020 | 2:12 PM

బ్యానర్‌: వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణ: నాని నటీనటులు: విశ్వక్‌సేన్‌, రుహానీ శర్మ, మురళీశర్మ, బ్రహ్మాజీ, హరితేజ, చైతన్య తదితరులు నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని రచన: డా.శైలేష్‌ కొలను కెమెరా: మణికందన్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ ఆర్ట్: అవినాష్‌ కొల్ల ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.వెంకటరత్నం (వెంకట్‌) స్టంట్స్: నభ సెన్సార్‌ సర్టిఫికెట్‌: యు/ఎ విడుదల: 28.02.2020 విక్రమ్‌(విశ్వక్‌సేన్‌) హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ లో పనిచేస్తుంటాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అతనికి బీపీ అమితంగా పెరుగుతూ ఉంటుంది. అందుకోసం అతన్ని ఉద్యోగానికి దూరంగా ఉండమని సజెస్ట్ చేస్తుంది డాక్టర్‌. అదే విషయాన్ని అతని గర్ల్ ఫ్రెండ్‌ నేహా కూడా సజెస్ట్ చేస్తుంది. అయితే తనకు అన్నిటికన్నా పోలీస్‌ ఉద్యోగం ముఖ్యం అని గట్టిగా చెబుతాడు. అందుకు బలమైన నేపథ్యం ఉన్నట్టు ప్రవర్తిస్తుంటాడు. అయితే అది ఏంటనే విషయాన్ని నేహాతో కూడా పంచుకోవడానికి ఇష్టపడడు. ఈ నేపథ్యంలో అతనికీ, నేహాకు మధ్య గొడవ జరుగుతుంది. ఉన్నపళాన నేహా మిస్సింగ్‌ కేసు రిజిస్టర్‌ అవుతుంది. ఆ కేసును విక్రమ్‌ కొలీగ్‌ (శ్రీనాథ్‌) హ్యాండిల్‌ చేస్తుంటాడు. నేహా మిస్సింగ్‌లో భాగంగా విక్రమ్‌ని కూడా అనుమానిస్తుంటాడు. అయితే గర్ల్ ఫ్రెండ్‌కి దూరమైన విక్రమ్‌ మాత్రం ఆ దూరాన్ని తట్టుకోలేడు. పైగా అతను కూడా సైడ్‌గా ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఆ క్రమంలో అతనికి ప్రీతీ మిస్సింగ్‌ కేసు గురించి తెలుస్తుంది. ప్రీతీ ఎందుకు మిస్‌ అయింది? ఆమెను ఓఆర్‌ఆర్‌ మీద చూసిన ఎస్‌.ఐ ఇబ్రహీమ్‌ (మురళీశర్మ) ఏమన్నాడు? ప్రీతీ అనాథ ఆశ్రమంలో ఎందుకు పెరిగింది? ఆమెకూ, పక్కింటి షీలా (హరితేజ)కు ఉన్న సంబంధం ఏంటి? ప్రీతీ ఫ్రెండ్స్ కి ఆమె మిస్సింగ్‌తో సంబంధం ఉందా? ప్రీతీని కిడ్నాప్‌ చేయించిన వ్యక్తి ఎవరు? అప్పటిదాకా విక్రమ్‌తోనే ఉన్న రోహిత్ (చైతన్య) చివరికి ఎందుకు మారిపోయాడు? రోహిత్‌ మరణంతో బయటపడ్డ విషయాలేంటి? షిండే (బ్రహ్మాజీ)కీ, నేహా మిస్సింగ్‌కీ ఉన్న సంబంధం ఏంటి? మెకానిక్‌ ఫాహద్‌ ఎవరు? అతనికి రోహిత్‌ భార్య ఎలా పరిచయం? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

ప్లస్‌ పాయింట్స్ – దర్శకుడు కథను బాగా డీల్‌ చేశాడు – కెమెరా వర్క్ స్టోరీ మూడ్‌ని క్యారీ చేసింది – నటీనటుల నటన, డైలాగులు – గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే – టెర్రిఫిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

నెగటివ్‌ పాయింట్స్ – చిన్నతనంలో చూసిన ప్రీతీని మిసెస్‌ రోహిత్‌ గుర్తుపట్టే ఎపిసోడ్‌ – శవాన్ని రీ ప్లేస్‌ చేసే ఎపిసోడ్‌ – ప్రీతీ హత్యకు చెప్పిన రీజన్‌

విశ్లేషణ గ్రిప్పింగ్‌గా సాగే క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్లను తెలుగు స్క్రీన్‌ మీద చాలానే చూశాం. ఆ తరహా చిత్రమే ‘హిట్‌’. హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌లో పోలీసుగా విశ్వక్‌సేన్‌ నటన బావుంది. అతని ఫ్రెండ్‌ రోహిత్‌గా చైతన్య, కొలీగ్‌గా శ్రీనాథ్‌, సీనియర్‌ ఆఫీసర్‌గా భానుచందర్‌, సీఐగా మురళీశర్మ, పక్కింటి షీలా పాత్రలో హరితేజ, నేహాగా రుహానీ శర్మ… ఇలా అందరూ తమ తమ కేరక్టర్లలో బాగా నటించారు. ప్రీతీ, నేహాను ఎవరు కిడ్నాప్‌ చేశారు? అనే పాయింట్‌ మీద సినిమా నడుస్తున్నంత సేపూ ప్రతి కేరక్టర్‌నీ అనుమానిస్తూనే ఉంటాం. స్క్రీన్‌ప్లే పక్కాగా కుదిరింది. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగులో కొత్త కాదు. ఆది పినిశెట్టి నటించిన మలుపు నుంచి రీసెంట్‌గా రిలీజైన ‘రాక్షసుడు’ వరకు ఈ తరహా స్క్రీన్‌ప్లేతో సాగిన సినిమాలు చాలానే ఉన్నాయి. క్లైమాక్స్ వరకూ ఇంట్రస్టింగ్‌గా సాగిన ‘హిట్‌’ సినిమా క్లైమాక్స్ లో అసలైన రీజన్‌ తెలిశాక ‘ఇంతేనా’ అనిపిస్తుంది. పైగా రోహిత్‌ భార్య పబ్‌లో ప్రీతీని గుర్తుపట్టే సీన్‌ కూడా తేలిపోయింది. పాతిపెట్టిన శవాన్ని తీసి మళ్లీ దాని మీద ఇప్పటి ఆనవాళ్లు వేయడం, మళ్లీ మరోచోట పాతిపెట్టడం తదితర దృశ్యాలు కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమా మొదలైనప్పటి నుంచీ విక్రమ్‌ కంట్లో కనిపించే మంటలకు చివరి దాకా రీజన్‌ తెలియకపోవడం అనేది ప్రేక్షకుడిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. రీజన్‌ చెప్పనప్పుడు అన్నిసార్లు ఆ షాట్స్ ని ఎందుకు రిపీట్‌ చేసినట్టు అనే చిరాకు కూడా కలుగుతుంది. స్క్రిప్ట్ లో కామెడీకి స్కోప్‌ ఉన్నప్పటికీ ఎందుకో ఆ పరంగా వర్క్ జరగలేదని అనిపిస్తుంది. వివేక్‌ సాగర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, మణికందన్‌ కెమెరా వర్క్ మూవీని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. లాస్ట్ షాట్‌లో హీరో మీద కాల్పులు జరగడం సీక్వెల్‌ సిద్ధమవుతుందనే హింట్స్ ని డైరక్ట్ గా పోస్ట్ చేశాయి. సన్నివేశాలను బలంగా రాసుకుని, కాస్త కామెడీ, ఇంకాస్త సీరియస్‌నెస్‌ పెంచుకుంటే ఈ సీరీస్‌లో ఎన్ని సినిమాలు చేసినా ఆదరణ ఉంటుంది. కాకపోతే రిపీట్‌ ఆడియన్స్ ని ఎక్స్ పెక్ట్ చేయలేమేమో. బీ,సీలకు ఈ మూవీ ఎంత వరకు రీచ్‌ అవుతుందనేదీ ఆలోచించాల్సిన విషయం. బాటమ్‌ లైన్‌: థ్రిల్లర్‌ జోనర్‌లో… ‘హిట్‌’ – డా. చల్లా భాగ్యలక్ష్మి.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?