మీకు EPF అకౌంట్ ఉందా? అయితే మీరు ఇలా కూడా మోసపోవచ్చు!

మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఖాతాలో మీ పేరు ఏంటి? ఇలా అన్ని రకాల వివరాలు తెలుసుకుని.. UAN నెంబర్‌ తెలుసుకుంటారు. అంతే.. ఇంకేముంది..

మీకు EPF అకౌంట్ ఉందా? అయితే మీరు ఇలా కూడా మోసపోవచ్చు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 28, 2020 | 1:15 PM

మీకు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) అకౌంట్ ఉందా? మీ పీఎఫ్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారా? ఇదే అదునుగా భావిస్తోన్న సైబర్ క్రైమ్ నేరాళ్లు.. అడ్డంగా మీ ఖాతాలోని డబ్బులను ఈజీగా దోచుకుంటున్నారు. ముందుగా అపరిచిత వ్యక్తి నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు.

మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ఖాతాలో మీ పేరు ఏంటి? ఇలా అన్ని రకాల వివరాలు తెలుసుకుని.. UAN నెంబర్‌ తెలుసుకుంటారు. అంతే.. ఇంకేముంది.. ఈ వివరాలతో ఆ సైబర్ నేరగాళ్లు తమ అకౌంట్‌లోకి డబ్బులను క్లెయిమ్ చేసుకుంటారు. ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్ నుంచి మనీ మాయం అవుతుంది.

ఇలాంటి మోసాలపై ఖాతాదారున్ని అప్రమత్తం చేసేలా ఈపీఎఫ్ కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఖాతాదారుడు ఎలా మోసపోతున్నాడో.. తెలుపుతూ జాగ్రత్తలు పేర్కొంది. కాగా ముఖ్యంగా ఉద్యోగం మారిన వారినే వీరు ఎక్కువగా టార్గెట్ చేస్తూంటారు. ఈ మోసాలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్టు ఈపీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. దయచేసి ఖాతాదారుని పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎవరికీ చెప్పొద్దని వారు సూచనలు చేశారు. మీకు ఏమైనా అనుమానాలుంటే.. దగ్గర్లోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాలి. అలాగే ఎట్టిపరిస్థితుల్లో మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయకూడదన్నారు.