ఐటీ చట్రంలో హీరో విజయ్.. తెర వెనుక బీజేపీ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో విజయ్‌పై ఐటీ విచారణకు సంబంధించిన షాకింగ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటే వెలుగుచూస్తున్నాయి. సుమారు 28 గంటల పాటు ఐటీ అధికారులు హీరో విజయ్‌ని మొదట షూటింగ్ స్పాట్‌లోను.. ఆ తర్వాత ఆయన ఇంట్లోను విచారించారు. దీనికి కారణం ఆయన దగ్గర దొరికి 30 కోట్ల రూపాయలని కొందరు.. 70 కోట్ల రూపాయలని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తున్నాయి. హీరో విజయ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం […]

ఐటీ చట్రంలో హీరో విజయ్.. తెర వెనుక బీజేపీ!
Follow us

|

Updated on: Feb 07, 2020 | 5:50 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో విజయ్‌పై ఐటీ విచారణకు సంబంధించిన షాకింగ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటే వెలుగుచూస్తున్నాయి. సుమారు 28 గంటల పాటు ఐటీ అధికారులు హీరో విజయ్‌ని మొదట షూటింగ్ స్పాట్‌లోను.. ఆ తర్వాత ఆయన ఇంట్లోను విచారించారు. దీనికి కారణం ఆయన దగ్గర దొరికి 30 కోట్ల రూపాయలని కొందరు.. 70 కోట్ల రూపాయలని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తున్నాయి.

హీరో విజయ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని, అందుకోసం ఆయన ప్రశాంత్ కిశోర్‌తో సర్వే చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి తనకుతానుగా ఎక్కడా మాట్లాడలేదు. ఈ క్రమంలో ఆయనపై బీజేపీ కన్ను పడిందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ క్రమంలోనే బీజేపీ అధినేతల డైరెక్షన్‌లో ఆదాయపన్ను అధికారులు రంగప్రవేశం చేసి.. విచారణకు తెరలేపారని తెలుస్తోంది.

ఈ వాదనకు బలం చేకూర్చే అంశం శుక్రవారం నైవేలీ వద్ద జరిగిన గొడవగా మరికొందరు చెప్పుకుంటున్నారు. ఐటీ రైడ్స్ తర్వాత శుక్రవారం నైవేలి వద్ద మాస్టర్ సినిమా షూటింగ్‌లో విజయ్ పాల్గొన్నారు. నైవేలి లిగినైట్ కార్పొరేషన్ వద్ద గనిలో షూటింగ్ జరుగుతుండగా.. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారు. గనిలో సినిమా షూటింగ్‌కు అనుమతి ఎలా ఇస్తారంటూ బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. సినిమా షూటింగ్‌ను నలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. దాంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించి షూటింగ్ కొనసాగించారు.

ఐటీ రైడ్స్ వెనుక బీజేపీ వుందని బలంగా భావిస్తున్న విజయ్ ఫ్యాన్స్ తాజాగా షూటింగ్ వద్ద బీజేపీ శ్రేణులు గొడవ చేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. దాడులకు కుట్ర చేసిన బీజేపీ అధినాయకత్వమే షూటింగ్ అడ్డుకునేందుకు స్కెచ్ వేసిందని ఫ్యాన్ ఆరోపిస్తున్నారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..