బంగారంలాంటి కాపురంలో నిప్పులు పోసిన టిక్‌టాక్‌

చైనావాడు పంపిన కరోనా వైరస్‌ ఎంత డేంజరో వాడే వదిలిన టిక్‌టాక్‌ కూడా అంతే డేంజరనిపిస్తోంది చూడబోతే..! టిక్‌టాక్‌ మోజులో కాపురాలే కూలిపోతున్నాయి… చదువులు అటకెక్కుతున్నాయి.. ఆఫీసులో పనిమానేసి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటున్న ఉద్యోగులూ ఉన్నారు.. లేటెస్ట్‌గా బెంగళూరులో ఒకావిడ టిక్‌టాక్ కోసమని తన భర్తనే వదిలేసుకుంది.. స్టోరీలోకి వెళితే.. అనగనగా ఓ దంపతులు.. 2008లో పెళ్లియిన వారిద్దరికి ఓ కొడుకు… 2014లో భర్తకు సౌదీ అరేబియాలో ఉద్యోగమొస్తే అక్కడికి వెళ్లిపోయాడు.. భార్యేమో పక్కింటామె కోరికను కాదనలేక […]

బంగారంలాంటి కాపురంలో  నిప్పులు పోసిన టిక్‌టాక్‌

చైనావాడు పంపిన కరోనా వైరస్‌ ఎంత డేంజరో వాడే వదిలిన టిక్‌టాక్‌ కూడా అంతే డేంజరనిపిస్తోంది చూడబోతే..! టిక్‌టాక్‌ మోజులో కాపురాలే కూలిపోతున్నాయి… చదువులు అటకెక్కుతున్నాయి.. ఆఫీసులో పనిమానేసి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటున్న ఉద్యోగులూ ఉన్నారు.. లేటెస్ట్‌గా బెంగళూరులో ఒకావిడ టిక్‌టాక్ కోసమని తన భర్తనే వదిలేసుకుంది.. స్టోరీలోకి వెళితే.. అనగనగా ఓ దంపతులు.. 2008లో పెళ్లియిన వారిద్దరికి ఓ కొడుకు… 2014లో భర్తకు సౌదీ అరేబియాలో ఉద్యోగమొస్తే అక్కడికి వెళ్లిపోయాడు.. భార్యేమో పక్కింటామె కోరికను కాదనలేక టిక్‌టాక్‌లో జొరబడింది… కొద్దినెలలకే టిక్‌టాక్‌కు అడిక్ట్‌ అయిపోయింది.. పొద్దస్తమానం అదే పిచ్చి… తరచుగా వీడియోలు పోస్టు చేస్తుండటంతో ఆమెకు ఫాలోవర్లు బాగా పెరిగిపోయారు.. అటు తిరిగి ఇటు తిరిగి ఆ వీడియోలు ఆమె భర్త కంట్లో పడ్డాయి… ఆ వీడియోల్లో తన భార్య అసభ్యంగా డాన్స్‌ చేయడం.. దానికి లక్షలాది లైకులు రావడం.. లెక్కలేనన్ని అగ్లీ కామెంట్స్‌ రావడం చూసి భర్త కోపంతో ఊగిపోయాడు.. ఇదేదో తిరకాసు వ్యవహారంలా ఉందనుకున్నాడు.. వెంటనే ఫోన్‌ చేసి భార్యను నిలదీశాడు.. వీడియోకాల్‌ చేసి తిట్టిపోశాడు.. భర్త తిట్లను లైట్‌ తీసుకున్న భార్య.. తానేమీ అసభ్యంగా డాన్స్‌ చేయలేదని.. నీ ప్రెండే తన వీడియోను మార్ఫ్‌ చేసి నీకు పంపాడని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.. మొసలి కన్నీరు కార్చింది.. అమె చెప్పినవేమీ అతడు నమ్మలేదు.. వెంటనే మంచి జీతం వస్తున్న జాబ్‌ను వదిలిపెట్టేసి ఇండియాకు వచ్చేశాడు. ఫోన్‌లో భార్య చేసిన టిక్‌టాక్‌ వీడియోలను చూశాడు.. అప్పుడు కూడా తనను అనుమానిస్తున్నావంటూ భార్య దొంగ ఏడుపులు ఏడ్చింది.. ఆ తర్వాత ఇంట్లోనే చేసిన ఓ వీడియోతో ఆమె బండారం బట్టబయలయ్యింది.. గట్టిగా అడిగితే ఆ వీడియోలు తాను చేసినవేనని ఒప్పేసుకుంది.. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.. పోలీసులు ఇద్దరిని ఫ్యామిలీ కౌన్సిలర్‌ దగ్గరకు పంపించారు.. అక్కడ భార్యభర్తల మధ్య వాదులాటలు జరిగాయి.. జరిగిందేదో జరిగింది.. ఇప్పటికైనా టిక్‌టాక్‌ను వదిలిపెట్టమని భర్త రిక్వెస్ట్‌ చేశాడు.. ఆమె మాత్రం వదిలితే నిన్ను వదులుకుంటాను తప్ప టిక్‌టాక్‌ను కాదని తేల్చి చెప్పింది.. తనను ఎంతోగానే అభిమానిస్తున్న లక్షలాదిమందిని నిరాశపర్చలేనని కరాఖండిగా చెప్పేసింది..

Published On - 5:21 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu