Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komaki Flora E-Scooter: రెండు యూనిట్ల విద్యుత్ ఖర్చుతో 100 కిమీ ప్రయాణించొచ్చు.. పైగా ఫైర్ ప్రూఫ్.. ధర కూడా చాలా తక్కువ.. 

దీనిలో మార్చుకోదగిన బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందుకోసం ఇది కేవలం రెండు యూనిట్ల విద్యుత్ ను మాత్రమే తీసుకుంటుందని కంపెనీ చెబుతోంది. పైగా ఈ బ్యాటరీ ఫైర్ ప్రూఫ్ అని ప్రకటించింది.

Komaki Flora E-Scooter: రెండు యూనిట్ల విద్యుత్ ఖర్చుతో 100 కిమీ ప్రయాణించొచ్చు.. పైగా ఫైర్ ప్రూఫ్.. ధర కూడా చాలా తక్కువ.. 
Komaki Flora Electric Scooter
Follow us
Madhu

|

Updated on: Apr 06, 2023 | 7:00 PM

భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో లాంచ్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలకు తోడు, ఇంధన ధరలు పెరగడం, వినియోగదారుల్లో పొల్యూషన్ ఫ్రీ వాహనాల పట్ల అవగాహన పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమాకి ఎలక్ట్రిక్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. కోమాకి ఫ్లోరా పేరుతో దీనిని మన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది క్లాసీ లుక్ తో పాటు సూపర్ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీనిలో మార్చుకోదగిన బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇందుకోసం ఇది కేవలం రెండు యూనిట్ల విద్యుత్ ను మాత్రమే తీసుకుంటుందని కంపెనీ చెబుతోంది. పైగా ఈ బ్యాటరీ ఫైర్ ప్రూఫ్ అని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

లుక్, డిజైన్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ట్రెడిషనల్ స్కూటర్ లుక్ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మ్యాప్‌లను నావిగేట్ చేయంలో ఉపయోగపడుతుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ గానూ పనిచేస్తుంది. ఇందులో మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. ఇది బ్లాక్, రెడ్, గ్రే, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తోది.

సామర్థ్యం.. దీనిలో 3 కిలోవాట్ సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుంది. మార్చకోదగిన బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఈ బ్యాటరీలు సింగిల్ చార్జ్ పై 75 నుంచి 100 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి నాలుగు నుంచి 5 గంటల సమయం పడుతుంది. 100 కిలోమీటర్ల దూరానికి కేవలం రెండు యూనిట్ల విద్యుత్ ని మాత్రమే ఇది తీసుకుంటుందని కోమాకి కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఫీచర్స్.. రివర్స్ గేర్, పార్కింగ్, క్రూయిజ్ కంట్రోల్, సెల్ఫ్ డయాగ్నస్టిక్ మీటర్‌తో కలర్‌ఫుల్ డ్యాష్‌బోర్డ్, అనేక ఇతర సౌకర్యాలు స్కూటర్‌లో ఉన్నాయి. వాహనం ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు.

ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ.. ఈ స్కూటర్ లో లిథియం అయాన్ బ్యాటరీ స్థానంలో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు. ఇది సాధారణ బ్యాటరీతో పోల్చితే తక్కువ హీట్ ను జెనరేట్ చేస్తుంది. ఈ కారణంగా వాహనంలో మంటలు చెలరేగే అవకాశం ఉండదు. అంతేకాదు.. ఈ బ్యాటరీ పైర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.

ధర.. మన దేశంలో కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 78,999గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..