సంక్రాంతి నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఇదీ పరిస్థితి!

సంక్రాతి సందర్భంగా నగరవాసులు తమ సొంత ఊళ్లకు తరలి వెళుతున్నారు. దీంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ ప్లాజా వద్ద ఉన్న 16 కౌంటర్లలో 9 విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలకు కేటాయించబడ్డాయి. వాటిలో, ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాల కోసం ఐదు టోల్ కౌంటర్లు మరియు ఫాస్ట్ ట్యాగ్ కాని వాహనాల కోసం తొమ్మిది కౌంటర్లను కేటాయించారు. వీటిలో నాలుగు క్యాష్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:45 am, Sun, 12 January 20
సంక్రాంతి నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఇదీ పరిస్థితి!

సంక్రాతి సందర్భంగా నగరవాసులు తమ సొంత ఊళ్లకు తరలి వెళుతున్నారు. దీంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ ప్లాజా వద్ద ఉన్న 16 కౌంటర్లలో 9 విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలకు కేటాయించబడ్డాయి. వాటిలో, ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాల కోసం ఐదు టోల్ కౌంటర్లు మరియు ఫాస్ట్ ట్యాగ్ కాని వాహనాల కోసం తొమ్మిది కౌంటర్లను కేటాయించారు. వీటిలో నాలుగు క్యాష్ అండ్ క్యారీ, 5 ఫాస్టాగ్ పద్ధతిలో పని చేస్తున్నాయి. ఫాస్టాగ్‌లో కూడా ఎక్కువ సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ దగ్గర కూడా వాహనదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.

ఈ నేపథ్య,లో పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ స్కానర్ పని చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. కొర్లపాడులో 8 టోల్ గేట్లు తెరిచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనదారులకు నాలుగు గేట్లు తెరిచారు. స్కానర్ పనిచేయని కారణంగా పాత ఛార్జీల ప్రకారం టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.