Google Messages: పెద్ద ఎత్తున వస్తోన్న మెసేజ్‌లతో కన్ఫ్యూజ్ అవుతున్నారా.? అయితే ఈ కొత్త ఫీచర్ మీ కోసమే..
Google Messages New Feature: ప్రతిరోజూ మనకు పదుల సంఖ్యలో మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని అవసరమైనవి ఉంటే చాలా వరకు టెలికాం ఆపరేటర్లకు, ఇతర వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన మెసేజ్‌లే ఎక్కువగా ఉంటాయి. ఇలా చూస్తుండగానే..
Google Messages New Feature: ప్రతిరోజూ మనకు పదుల సంఖ్యలో మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని అవసరమైనవి ఉంటే చాలా వరకు టెలికాం ఆపరేటర్లకు, ఇతర వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన మెసేజ్‌లే ఎక్కువగా ఉంటాయి. ఇలా చూస్తుండగానే ఫొన్‌లో మెసేజ్‌లు నిండిపోతాయి. దీంతో పలు సందర్భాల్లో ఇది ఫోన్ మెమోరీ ఫుల్ కావడానికి దారి తీస్తుంది. అలా కాకుండా మన ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను క్యాటగిరీలాగా డివైడ్ చేసి చూపిస్తే భలే ఉంటుంది కదూ.! దీని వల్ల అవసరంలేని మెసేజ్‌లను ఇట్టే డిలీట్ చేసేయొచ్చు. అచ్చంగా ఇలాంటి ఆలోచన నుంచే గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో మీ మొబైల్ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లను పర్సనల్, ట్రాన్సాక్షన్/ ప్రమోషనల్మెసేజ్లను వేరు వేరుగా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం గూగుల్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇక ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిన ఇటవలీ కాలంలో ఓటీపీలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే మనం సమయానికి ఓటీపీని వాడుకొని ఆ మెసేజ్‌ను డిలీట్ చేయకుండా అలాగే వదిలేస్తాం. ఇది కూడా ఫోన్ మెమోరీ నిండిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. దీనికి చెక్ పెట్టడానికే గూగుల్.. 24 గంటల్లో ఓటీపీకి సంబంధించిన మెసేజ్‌లు ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. గూగుల్ మెసేజెస్ యాప్‌లోకి వెళ్లి ఓటీపీ కేటగిరీ కింద కనిపించే ‘కంటిన్యూ’ ఆప్షన్ నొక్కాలి. తద్వారా ఈ కొత్త ఫీచర్ మీ ఫోన్‌లో అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ 8 పై ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నింటిలో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ నిజంగానే ఉపయోగపడేలా ఉంది కదూ.!
Pace Maker: బ్యాటరీ లేకుండా పనిచేసే తాత్కాలిక పేస్‌మేకర్ సృష్టించిన శాస్త్రవేత్తలు