PM Kisan: రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే ప్రతినెలా అకౌంట్లోకి రూ.3 వేలు..

అన్నదాతల కోసం కేంద్రం పలు రకాల పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా నేరుగా రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.

PM Kisan: రైతులకు శుభవార్త.. ఇలా చేస్తే ప్రతినెలా అకౌంట్లోకి రూ.3 వేలు..
Pmkmy
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 22, 2021 | 8:01 AM

అన్నదాతల కోసం కేంద్రం పలు రకాల పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా నేరుగా రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 6 వేలు జమ చేస్తుంది కేంద్రం. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. విడతల వారిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అంటే రూ.2 వేల చొప్పున రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అందుతున్నాయి. దీంతో దేశంలోని చాలా మంది రైతులకు ఆర్థికంగా కాస్త ఊరట కలగనుంది.

ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మాత్రమే కాకుండా.. రైతుల కోసం కేంద్రం మరిన్ని స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీ్మ్ కూడా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ప్రతి నెల రూ. 3 వేలు లభిస్తాయి. అంటే 12 నెలలకు కలిపితే.. సంవత్సరానికి రూ. 36 వేలు ఈ పథకం ద్వారా రైతులకు అందుతాయి. అయితే ఈ డబ్బులు పథకంలో చేరిన వారికి మాత్రమే లభిస్తాయి. అంతేకాకుండా.. 60 ఏళ్లు దాటిన రైతులకు నెలవారీ పెన్షన్ రూపంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ పథకంలో నమోదు చేసుకున్న రైతులు ఇందులో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు రెండు హెక్టార్లలోపు సాగు భూమిని కలిగి ఉండాలి. ఇందులో చేరడానికి ప్రత్యేకంగా ఎలాంటి సర్టిఫికేట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. నెలకు రూ. 55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రతిపాదికన మీరు చెల్లించాల్సిన మొత్తం మారుతుంది. ఎం కిసాన్ డబ్బుల నుంచి పీఎం కిసాన్ మాన్‌ధన్ డబ్బులు చెల్లించొచ్చు. ఆటోమేటిక్‌గానే బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతాయి.

Also Read: వెండితెరపైకి సుప్రిత ?.. అసలు విషయం చెప్పిన సురేఖ వాణి.. ఇంతకీ మ్యాటరెంటంటే..

మరోసారి తన నోటికి పని చెప్పిన వనితా విజయ్ కుమార్.. స్టేజ్‏పైనే ఇష్టానుసారంగా మాటలు.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన శివగామి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్