Google Bookmarks: మరో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. సెప్టెంబర్‌ 30 నుంచి ఆ సేవలు నిలిచిపోనున్నాయి.

Google Bookmarks: ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. పాత సేవలకు స్వస్తి చెబుతూ ఇప్పటికే పలు రకాల సేవలను మూసి వేసిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలల క్రితం...

Google Bookmarks: మరో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. సెప్టెంబర్‌ 30 నుంచి ఆ సేవలు నిలిచిపోనున్నాయి.
Goolge Bookmarks
Follow us
Narender Vaitla

| Edited By: Subhash Goud

Updated on: Jul 22, 2021 | 9:13 AM

Google Bookmarks: ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. పాత సేవలకు స్వస్తి చెబుతూ ఇప్పటికే పలు రకాల సేవలను మూసి వేసిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలల క్రితం గూగుల్ మ్యూజిక్‌ సేవలను ఆపేసిన ఈ సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం తాజాగా మరో సేవకు ఫుల్ స్టాప్‌ పెట్టింది. గూగుల్‌ ‘బుక్‌మార్క్స్’ సేవలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 30 నుంచి గూగుల్‌ బుక్‌మార్క్స్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 30 తర్వాత బుక్‌మార్క్స్‌ సేవలకు గూగుల్ సపోర్ట్‌ ఇవ్వదని సంస్థ పేర్కొంది.

ఇక బుక్‌మార్క్స్‌ సేవలను నిలిపివేసినప్పటికీ.. యూజర్లు స్టార్‌ మార్క్‌ చేసిన ప్రదేశాలు, వెబ్‌ పేజీలపై ఎలాంటి ప్రభావం పడదని తెలిపింది. అవసరమైన వారు బుక్‌మార్క్స్‌ను ఎక్స్‌పోర్ట్‌ చేసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. ‘ఎక్స్‌ పోర్ట్‌ బుక్‌ మార్క్స్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా యూజర్లు తమ బుక్‌మార్క్స్‌ను సేవ్‌ చేసుకునే అవకాశాన్ని కలిపించారు. ఇదిలా ఉంటే గూగుల్‌ బుక్‌మార్క్స్‌ సేవలను అక్టోబర్‌ 10, 2005 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ అకౌంట్‌ కలిగి ఉన్నవారందరికీ ఈ సేవలను ఉచితంగా అందించారు. క్లౌడ్ ఆధారిత ఈ సేవల ద్వారా యూజర్లు వెబ్‌ పేజీలను, ఆడ్‌ లెబెల్స్‌, నోట్స్‌ను బుక్‌మార్క్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సేవలకు పెద్దగా ప్రజాధరణ రాకపోతుండడంతో గూగుల్‌ షట్‌ డౌన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read: Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్..! రేపటి నుంచి ఈ 3 నగరాల్లో బుకింగ్ ప్రారంభం..

Simple One: వచ్చేస్తోంది సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లొచ్చు..

Maglev Train China: మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా.. రెండున్నర గంటల్లో వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించే రైలు..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం