Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్..! రేపటి నుంచి ఈ 3 నగరాల్లో బుకింగ్ ప్రారంభం..
Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు దేశంలోని మరో మూడు నగరాల్లో, మైసూర్, మంగళూరు
Bajaj Chetak : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పుడు దేశంలోని మరో మూడు నగరాల్లో అనగా మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ లలో లభిస్తుంది. ఈ నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జూలై 22 నుంచి తమ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.2,000 చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ నగరాల్లోని వినియోగదారుల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు.
2022 నాటికి 24 నగరాల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని బజాజ్ ఆటో యోచిస్తోంది. నాగ్‌పూర్‌లో జూలై 16 నుంచి బుకింగ్ ప్రారంభమైంది. బజాజ్ ఆటో ఇంతకు ముందు పూణే, బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించింది. మునుపటి ICE స్కూటర్ తయారు చేసిన దాదాపు 15 సంవత్సరాల తరువాత 2020 లో చేతక్ బ్రాండ్ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తిరిగి వస్తుంది. పూణేలోని చకన్ ప్లాంట్లో ఈ కొత్త స్కూటర్లు తయారవుతున్నాయి.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 5 హెచ్‌పి శక్తిని 16.2 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మోటారు 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో జత చేయబడి ఉంటుంది. ఒకే ఛార్జీతో 95 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. స్కూటర్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ సాయంతో దాని బ్యాటరీ కేవలం ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. బజాజ్ ప్రకారం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ జీవితం 70,000 కిలోమీటర్లు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది.