Telangana Jobs : తెలంగాణలో 50 వేల పోస్టుల గురించి తీపి కబురు.. పెరిగిన మరిన్ని ఖాళీలు.. కొత్తగా ఏ శాఖల్లో ఖాళీలున్నాయంటే..?

Telangana Govt : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ వేగవంతమైంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను

Telangana Jobs : తెలంగాణలో 50 వేల పోస్టుల గురించి తీపి కబురు.. పెరిగిన మరిన్ని ఖాళీలు.. కొత్తగా ఏ శాఖల్లో ఖాళీలున్నాయంటే..?
Telangana Govt
Follow us
uppula Raju

|

Updated on: Mar 29, 2021 | 7:43 PM

Telangana Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ వేగవంతమైంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సేకరించారు. అయితే నోటిఫికేషన్లు ఎప్పుడో రావాల్సి ఉంది కానీ ఎన్నికల నియమావళి వల్ల వాయిదా పడుతున్నాయి. గత నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. ఈ ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే నెల మూడోవారంలో మొదటి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో అయిదువేల పోస్టులు తేలాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో అయిదువేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్క తేలాయి.

Young Boy Earn Money: వీడియో గేమ్స్‌ ఆడడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు.. నెల ఆదాయం రూ.36 లక్షలు..

ఆదిలాబాద్ రిమ్స్‌లో బాలింతల వార్డులోకి దూసుకొచ్చిన నాగుపాము.. ముప్పుతిప్పలు.. చివరకు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందడి.. నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీలు.. సందడిగా మారిన నెల్లూరు కలెక్టరేట్