AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిలాబాద్ రిమ్స్‌లో బాలింతల వార్డులోకి దూసుకొచ్చిన నాగుపాము.. ముప్పుతిప్పలు.. చివరకు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి గత కొన్ని రోజులుగా వార్తల్లో నానుతోంది. ఇప్పటికే సెక్యూరిటీ సరిగ్గా లేని కారణంగా భవనం పై నుంచి రోగులు దూకి చనిపోయిన..

ఆదిలాబాద్ రిమ్స్‌లో బాలింతల వార్డులోకి దూసుకొచ్చిన నాగుపాము.. ముప్పుతిప్పలు.. చివరకు
Snake in Dream
Ram Naramaneni
|

Updated on: Mar 29, 2021 | 7:21 PM

Share

Adilabad Rims: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి గత కొన్ని రోజులుగా వార్తల్లో నానుతోంది. ఇప్పటికే సెక్యూరిటీ సరిగ్గా లేని కారణంగా భవనంపై నుంచి రోగులు దూకి చనిపోయిన సంఘటనలు తరుచుగా జరుగుతుండగా, కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా గత రాత్రి ఆసుపత్రిలో నాగుపాము కలకలం రేపింది. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు( KMC) లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పామును చూసిన బాలింతలు, వారి సంరక్షకులు భయాందోళనకు గురయ్యారు. వార్డులో ఒక్కసారిగా పొడుగాటి నాగుపాము కనబడటంతో అక్కడ ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. వెంటనే పామును గమనించిన ప్రజల భయంతో బెడ్ పైకి ఎక్కి కూర్చున్నారు.

కొద్దిసేపు నాగుపాము వార్డులో అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేయడంతో వార్డులో ఉన్నవారు భయాందోళనకు గురై కేకలు వేశారు. దీంతో ఎటు వెళ్లేదారిలేక కొద్దిసేపటికి పాము వార్డులోని బాత్ రూమ్ లోకి వెళ్లింది. అటు బాత్ రూమ్ లో చెత్త చెదారం ఉండటంతో అందులోనే ఇరుక్కుపోయింది. వెంటనే వార్డులో ఉన్నవారు బాత్ రూమ్ డోర్ ను మూసివేశారు. తేరుకున్న ఆసుపత్రి సిబ్బంది వార్డులో ఉన్న బాలింతలు వేర్ వార్డుకు షిప్ చేశారు. అనంతరం స్నేక్ క్యాచర్ సాయంతో పామును పట్టుకుని.. అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే పాము హాస్పిటల్‌లోకి రావడం‌తో  అధికారులు, సిబ్బంది తీరుపై రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: చిట్టి పాదాలతో తనయుడి తొలి అడుగులు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వైరల్ వీడియో

మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి.. అదే వారి ప్రాణాలు తీసింది