Young Boy Earn Money: వీడియో గేమ్స్ ఆడడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు.. నెల ఆదాయం రూ.36 లక్షలు..
Young Boy Earn Money By Playing Games: సాధారణంగా అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుంటే చూసే వారు ఏం అంటారు..? ఏం పనిలేదా.. ఊరికే గేమ్స్ ఆడితే ఏం వస్తుంది.. రూపాయి ఆదాయం వచ్చేది కాదు, పోయేది కాదు..
Young Boy Earn Money By Playing Games: సాధారణంగా అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుంటే చూసే వారు ఏం అంటారు..? ఏం పనిలేదా.. ఊరికే గేమ్స్ ఆడితే ఏం వస్తుంది.. రూపాయి ఆదాయం వచ్చేది కాదు, పోయేది కాదు ఎందుకీ దిక్కుమాలిన గేమ్స్ అంటూ మందలిస్తుంటారు. అయితే ఇదే వీడియో గేమ్స్‌ని వృత్తిగా ఎంచుకున్నాడు ఓ పాతికేళ్ల కుర్రాడు. అంతేకాకుండా రూ. లక్షల్లో డబ్బును ఆర్జిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకు చెందిన మిన్‌క్యో అనే 24 ఏళ్ల కుర్రాడికి వీడియో గేమ్స్ ఆడడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ ఇష్టాన్నే తనకు డబ్బులిచ్చే వనరుగా మార్చుకోవాలనుకున్నాడు మిన్‌క్యో. ఇందు కోసం అతను యూట్యూబ్‌ను ఉపయోగించుకున్నాడు. తాను వీడియో గేమ్స్ ఆడుతోన్న సమయంలో యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాడు. ఇలా చేయడం ద్వారా మిన్‌క్యో నెలకు ఏకంగా 50 వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 36 లక్షలన్నమాట. మిన్‌క్యో యూట్యూబ్ అకౌంట్‌కు ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్‌లో వచ్చే యాడ్స్, స్పాన్సర్‌ఫిప్‌లతో ఈ కుర్రాడు ఈ రేంజ్‌లో సంపాదిస్తున్నాడు. ఇక కేవలం లైవ్ స్ట్రీమింగ్‌కు పరిమితం కాకుండా తన వీడియోలను ఆఫ్రికా టీవీ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు మిన్‌క్యో.
మిన్‌క్యో గురించి ప్రచురితమైన ఆర్టికల్..
Kim Min-kyo plays #VideoGames for up to 15 hours a day — and makes a fortune from the thousands of fans watching him. https://t.co/eC3zfAsbdR #Livestreamer #Millionaire #Socialmedia
— Digital Journal (@digitaljournal) March 26, 2021
Also Read: సచిన్ వాజే ప్రభుత్వానికి సమస్యలు తెచ్చి పెడతాడని ముందే కొందరు నేతలకు చెప్పా, సంజయ్ రౌత్
దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా..! చాలా పేస్ట్‌లు వాడి బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి..
చిన్నారిపై తల్లి ప్రేమ కురిపించిన కోతి.. సొంత అమ్మను కూడా దగ్గరకు రానివ్వని వానరం..