సచిన్ వాజే ప్రభుత్వానికి సమస్యలు తెచ్చి పెడతాడని ముందే కొందరు నేతలకు చెప్పా, సంజయ్ రౌత్
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులోనూ, ఆటో పార్ట్స్ డీలర్ మాన్ సుఖ్ హీరేన్ మృతి కేసులోనూ నిందితుడైన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఈ ప్రభుత్వానికి సమస్యలు తెచ్చి పెడతాడని తను ముందే...
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులోనూ, ఆటో పార్ట్స్ డీలర్ మాన్ సుఖ్ హీరేన్ మృతి కేసులోనూ నిందితుడైన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఈ ప్రభుత్వానికి సమస్యలు తెచ్చి పెడతాడని తను ముందే కొంతమంది నేతలకు చెప్పానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అతని ప్రవర్తన, అతని వర్కింగ్ స్టైల్ పై తనకు ముందే అనుమానం కలిగిందని ఆయన చెప్పారు. వాజే ఉదంతం మహారాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం నేర్పిందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ అధికారిని రాష్ట్ర పోలీసు శాఖలోకి మళ్ళీ తీసుకోవాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఇతడు మనకు ప్రాబ్లమ్స్ తేవచ్చునని కొంతమంది నాయకులను తాను హెచ్చరించానని సంజయ్ రౌత్ తెలిపారు. కానీ ఆ నేతల పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. బహుశా నాడు తాను చేసిన హెచ్చరిక వారికీ గుర్తుండి ఉండవచ్చు అని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా తాను జర్నలిస్టుగా ఉన్నానని, వాజే గురించి తనకు తెలుసునని అన్నారు. ఈ ఎపిసోడ్ వల్ల మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోగలిగాం అని పేర్కొన్నారు.
సీఎం ఉధ్ధవ్ థాక్రే మొదట సచిన్ వాజేని సమర్థించారన్న విషయాన్ని గుర్తు చేయగా.. వాజే కార్యకలాపాలన్నీ బయటపడ్డాయి గనుక ఇక అతడ్ని రక్షించే ఉద్దేశం ఎవరికీ లేదని సంజయ్ రౌత్ అన్నారు.అహమ్మదాబాద్ లో ఎన్సీపీ నేత శరద్ పవార్, హోమ్ మంత్రి అమిత్ షా మధ్య జరిగిన సమావేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ఇందులో తప్పేముందని అన్నారు. అమిత్ షా రోజూ పలువురు రాజకీయ నేతలతో సమావేశమవుతుంటారని సంజయ్ చెప్పారు. అది నిజంగా రహస్యంగా జరిగిన భేటీయే అయితే ఈ సమాచారం ఎలా పొక్కిందని పేర్కొన్నారు . దీనికి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తన సామ్నా పత్రికలో ఈయన.. సచిన్ వాజే వ్యవహారంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అలాగే హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను ఉద్దేశించి కూడా పేర్కొన్నారు. ఒక పోలీసు అధికారి చేసే కార్యకలాపాల గురించి హోమ్ మంత్రికి ఎలా తెలియకుండా ఉంటుందన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :pawan kalyan Vakeel Saab Trailer:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ లాంచ్ ( వీడియో ).