ఇ౦జనీరి౦గ్, ఫార్మా కోర్సులకు గీత౦ నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ లో బీటెక్‌, ఎంటెక్‌, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌ తెలిపారు. గీతం హైదరాబాద్‌, నాగోలు, సికింద్రాబాదు, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌తో పాటు దేశవ్యాప్తంగా 50 పట్టణాలలో గీతం ఆన్‌లైన్‌లో పరీక్ష(గాట్‌-2019) నిర్వహిస్తోందని వివరించారు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌ స్లైడింగ్‌ విధానంలో సీట్లు కేటాయిస్తామని శివప్రసాద్‌ తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను మార్చి 30వ తేదీలోగా పంపాలని, ఆన్‌లైన్‌ పరీక్షలను ఆయా కేంద్రాలలో […]

ఇ౦జనీరి౦గ్, ఫార్మా కోర్సులకు గీత౦ నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ లో బీటెక్‌, ఎంటెక్‌, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌ తెలిపారు. గీతం హైదరాబాద్‌, నాగోలు, సికింద్రాబాదు, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌తో పాటు దేశవ్యాప్తంగా 50 పట్టణాలలో గీతం ఆన్‌లైన్‌లో పరీక్ష(గాట్‌-2019) నిర్వహిస్తోందని వివరించారు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌ స్లైడింగ్‌ విధానంలో సీట్లు కేటాయిస్తామని శివప్రసాద్‌ తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను మార్చి 30వ తేదీలోగా పంపాలని, ఆన్‌లైన్‌ పరీక్షలను ఆయా కేంద్రాలలో ఏప్రిల్‌ 10 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. తుది ఫలితాలను ఏప్రిల్‌ 26న వెల్లడిస్తామని చెప్పారు. ఇతర వివరాల కోసం 9542424256/66 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని లేదా www.githam.edu.in వెబ్‌సైట్‌ చూడాలని ఆయన సూచించారు.

Published On - 12:28 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu