లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అనూహ్య రీతిలో ప్రధాని మంత్రి మోడీపై విరుచుకుపడ్డాడు. ‘నేను బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పును చెల్లిస్తానని చెబుతున్నా.. కానీ అందుకు బ్యాంకులే రాజీ పడటం లేదని ’అంటున్నారు కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్యా. ఇండియాలో పలు బ్యాంకుల వద్ద డబ్బును తీసుకుని బ్రిటన్ కు ఉడాయించాడు మల్యా. ఆయన్ను తిరిగి భారత్ కు అప్పగించడం విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా.. ‘నాకు తెలుసు ఆయన ఒక మంచి మాటకారి. రూ.9 వేల కోట్లతో ఓ వ్యక్తి భారత్ నుంచి పరారయ్యాడు ’అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండా ప్రస్తావించారు. నాకు అర్థమయ్యింది ఆయన నా గురించే మాట్లాడారు. ప్రధానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నేను బ్యాంకుల వద్ద తీసుకున్న డబ్బు చెల్లిస్తానన్నా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాల్యా. కింగ్ ఫిషర్ తరపున బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నీ తిరిగి చెల్లించేస్తానంటూ మరోసారి ట్విటర్లో గురువారం ఆయన వరుస పోస్టులు పెట్టారు. అయినా.. కింగ్ ఫిషర్ కి అప్పుగా ఇచ్చినదాన్ని వసూలు చేసారన్న ఘనత కూడా మీకే వస్తుంది కాదా..? అని మాల్యా ప్రధాని మోడీ ప్రశ్నించారు.