మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

బీహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రధాని నరేంద్రమోదీ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ నేత, అస్సాం ఎంపీ గౌరవ్‌ గోగోయ్ తప్పుబట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వ్యాధితో బాధపడుతూ వందలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆసుపత్రుల్లో అదనపు పడకల ఏర్పాటు విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఇచ్చిన హామీ కేవలం కాగితాలకే పరితమైందని ఆరోపించారు. కాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు కారణంగా ఇప్పటి […]

మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 19, 2019 | 9:09 PM

బీహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రధాని నరేంద్రమోదీ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ నేత, అస్సాం ఎంపీ గౌరవ్‌ గోగోయ్ తప్పుబట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వ్యాధితో బాధపడుతూ వందలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆసుపత్రుల్లో అదనపు పడకల ఏర్పాటు విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఇచ్చిన హామీ కేవలం కాగితాలకే పరితమైందని ఆరోపించారు. కాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు కారణంగా ఇప్పటి వరకు 156 మంది చిన్నారులు మరణించినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.