స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ ఆరంభంలోనే 350 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయిన సెన్సెక్స్ కాసేపటికే 400 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. అయితే సూచీల జోరు ఎంతోసేపు నిలువలేదు. కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు అమాంతంగా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 555 పాయింట్లు దిగజారి భారీ నష్టంతో ట్రేడ్ అయ్యింది. అయితే చివరి గంటల్లో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో నష్టాల నుంచి మార్కెట్లు తేరుకున్నాయి. […]
దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ ఆరంభంలోనే 350 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయిన సెన్సెక్స్ కాసేపటికే 400 పాయింట్ల లాభంతో దూసుకెళ్లింది. అయితే సూచీల జోరు ఎంతోసేపు నిలువలేదు. కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు అమాంతంగా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 555 పాయింట్లు దిగజారి భారీ నష్టంతో ట్రేడ్ అయ్యింది.
అయితే చివరి గంటల్లో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో నష్టాల నుంచి మార్కెట్లు తేరుకున్నాయి. ఈ ఊగిసలాటలో సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా.. నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 39,113 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్థిరంగా 11,691 వద్దే ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.70గా కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో టాటాస్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్ షేర్లు లాభపడగా.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, యస్ బ్యాంక్, యూపీఎల్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.