కొవిడ్ డెడ్‌బాడీలను తీసుకెళ్లే అంబులెన్సులకు ఛార్జీలు ఫిక్స్
కరోనా డెడ్‌బాడీలను తీసుకెళ్లే ప్రైవేటు అంబులెన్సులకు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత ఛార్జీలను ఫైనల్ చేస్తూ గుంటూరు జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా డెడ్‌బాడీలను తీసుకెళ్లే ప్రైవేటు అంబులెన్సులకు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత ఛార్జీలను ఫైనల్ చేస్తూ గుంటూరు జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజల అవసరాన్ని అవకాశంగా భావించి కొందరు దోపిడికి తెగబడ్డారు. ఈ విషయం మీడియా ద్వారా జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి రావడంతో ప్రైవేటు అంబులెన్సులు, ప్రైవేటు వాహనాలకు నిర్దేశిత ఛార్జీలను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేశారు.
కరోనా డెడ్‌బాడీలను తీసుకెళ్లడానికి తేలికపాటి వాహనాలకు 2,600, సాధారణ డెడ్‌బాడీలకు 1,600 రూపాయల చొప్పున రుసుం నిర్ణయించారు. గరిష్ఠంగా 101 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు రూ. 5,600 …సాధారణ డెడ్‌బాడీలైతే రూ. 4,600 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. నిర్ణయించిన ఛార్జీలనే వసూలు చేయాలని.. లేనిపక్షంలో బాధితులు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 0863-2229336, 2271492కు ఫిర్యాదు చేయాలని డీటీసీ మీరా ప్రసాద్ సూచించారు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!