AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కువైట్ లో ప్రవాసీలు గడప దాటితే శిక్ష

కువైట్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌వాసులు ఎవ‌రైనా హోం క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే వారికి మూడు నెల‌ల‌కు మించ‌కుండా జైలు అంతేకాదు 5వేల కువైటీ దినార్స్ అంటే అక్షరాల రూ.12,22,398 జ‌రిమానా లేదా రెండు విధించేటట్లు తాజాగా అక్క‌డి స‌ర్కార్‌ కొత్త‌గా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేసింది.

కువైట్ లో ప్రవాసీలు గడప దాటితే శిక్ష
Balaraju Goud
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 3:59 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా అయా దేశాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. తాజాగా కువైట్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌వాసులు ఎవ‌రైనా హోం క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే వారికి మూడు నెల‌ల‌కు మించ‌కుండా జైలు అంతేకాదు 5వేల కువైటీ దినార్స్ అంటే అక్షరాల రూ.12,22,398 జ‌రిమానా లేదా రెండు విధించేటట్లు తాజాగా అక్క‌డి స‌ర్కార్‌ కొత్త‌గా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేసింది. సంక్రమణ వ్యాధులను నివారించడానికి ఆరోగ్య జాగ్రత్తలు, దాని సవరణలకు సంబంధించి 1969లో తీసుకొచ్చిన‌ 8వ చట్టం ప్రకారం ఈ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ పేర్కొంది. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ నేప‌థ్యంలో కువైట్ స‌ర్కార్ ఈ స‌వ‌ర‌ణ‌లు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇకపై వ‌ల‌స‌దారులు కువైట్ వ‌చ్చిన త‌ర్వాత స్వీయ, సమాజ ఆరోగ్య‌ భద్రత కోసం హోం క్వారంటైన్ నిబంధ‌న‌ల‌కు కట్టుబడి ఉండాల‌ని హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ఇదిలావుంటే, అటు కువైట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 73,068 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 486 మంది కొవిడ్ రాకాసికి బ‌లయ్యారు.

Follow Us
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
తెలుగునేలపై దర్శనమిచ్చిన అరుదైన పాము.. బొమ్మలా నటిస్తూ..
తెలుగునేలపై దర్శనమిచ్చిన అరుదైన పాము.. బొమ్మలా నటిస్తూ..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!