సెల్‌ఫోన్ మాట్లాడుతూ పెట్రోల్ పోయించుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇదే ఉదాహరణ

నిత్య జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అపాయాలు ఎలా సంభవిస్తాయో.. అవి ఎలా ప్రాణాలు తీస్తాయో ఎన్నోసార్లు రుజువైనప్పటికీ చాలమంది నిర్లక్ష్యాన్ని మాత్రం మానుకోరు. పెట్రోల్ బంకుల్లో మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని హెచ్చరిక బోర్టులు కళ్లముందు కనిపిస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయరు. పెట్రోల్ పోయించుకునే సందర్భంలో ఫోన్ మాట్లాడుతూ ఉండగా గతంలో జరిగిన ఎన్నో భారీ అగ్నిప్రమాదాల్లో ఏకంగా ఆ బంకులు దగ్ధం కావడమే కాకుండా అక్కడున్నవారు సైతం దారుణంగా ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలున్నాయి. ఇటువంటి […]

సెల్‌ఫోన్ మాట్లాడుతూ పెట్రోల్ పోయించుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇదే ఉదాహరణ
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 8:39 PM

నిత్య జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అపాయాలు ఎలా సంభవిస్తాయో.. అవి ఎలా ప్రాణాలు తీస్తాయో ఎన్నోసార్లు రుజువైనప్పటికీ చాలమంది నిర్లక్ష్యాన్ని మాత్రం మానుకోరు. పెట్రోల్ బంకుల్లో మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని హెచ్చరిక బోర్టులు కళ్లముందు కనిపిస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయరు. పెట్రోల్ పోయించుకునే సందర్భంలో ఫోన్ మాట్లాడుతూ ఉండగా గతంలో జరిగిన ఎన్నో భారీ అగ్నిప్రమాదాల్లో ఏకంగా ఆ బంకులు దగ్ధం కావడమే కాకుండా అక్కడున్నవారు సైతం దారుణంగా ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలున్నాయి. ఇటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమే.

తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి పెట్రోల్ పోయించుకోడానికి వచ్చిన వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడటమే కారణమని తెలుస్తోంది.

పెంట్రోల్ ట్యాంక్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగ మంటలు చెలరేగిన వెంటనే వాహనదారులు తమ వాహనాలను విడిచిపెట్టి అక్కడినుంచి పారిపోయారు.. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది మాత్రం తమ ప్రాణాలకు తెగించి మంటల్ని ఆర్పివేశారు. చుట్టుపక్కల ఉన్న మట్టిని ఆ మంటలపై వేయడం ద్వారా మంటల వ్యాప్తిని అరికట్టారు. ఒకవేళ మంటలు మరింత పెద్దవై ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని అంచనా వేస్తున్నారు.