ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజులు సవరించిన ప్రభుత్వం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజులు సవరించిన ప్రభుత్వం
Follow us

|

Updated on: Nov 06, 2020 | 11:49 AM

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా ట్యూషన్‌ ఫీజును రూ.15 వేలకు పెంచారు. గతంలో దీని ఫీజు రూ.12,155గా ఉంది. బీ కేటగిరీ ఫీజు ఇప్పటివరకు రూ.13,37,057 ఉండగా..తాజా ఉత్తర్వుల ప్రకారం రూ. 12లక్షలకు తగ్గించారు. గతంలో సీ కేటగిరీ ఫీజు రూ.33,07, 500 ఉండగా, ప్రస్తుతం రూ. 36 లక్షలుగా ఫైనల్ చేశారు. సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15లక్షలకు సవరించారు. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌మైనారిటీ కాలేజీలకు నూతన ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

Also Read :

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

విషాదం.. కొండచరియలు విరిగిపడి 37మంది దుర్మరణం