ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం..చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప యాత్రను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు.

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 8:14 AM

ఓ రాజకీయ నాయకుడి యాత్ర దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఓ అద్వితీయ విజయానికి నాంది పలికింది.  చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప యాత్రను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి  2017 నవంబర్‌ 6వ తేదీన జగన్‌ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ పాదయాత్రలో అలుపెరగని పోరాటం సాగించారు. 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా ప్రజల కష్టాలు వింటూ, నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ముందుకు సాగారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగిసింది.

13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని తొలుత పార్టీ వర్గాలు భావించినా, చివరకు అది 14 నెలల పాటు సాగింది. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రకు స్వస్తీ పలుకుతూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్రను సాగించారు.  13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 62 నగరాలు, పట్టణాలు… 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలలో జగన్‌ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో భాగమయ్యారు. కనిపించిన ప్రతి మనిషిని ఆయన అక్కున చేర్చుకున్నారు. చెప్పుకున్న ప్రతి కష్టాన్ని సావధానంగా విన్నారు. తన ప్రభుత్వం వస్తే సుపరిపాలన అందిస్తానని భరోసా ఇచ్చారు. అధికారం ఇస్తే  తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికుండాలన్న ఆశతో పాలన సాగిస్తానని జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో‌ ప్రజలకు మాట ఇచ్చారు.

ఆపై  ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా జనం మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. కని,విని ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభా స్థానాల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read : మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..