Lifestyle: సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
తేలికగా జీర్ణమయ్యే ఈ ఆహారం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు అధితంగా ఉంటాయి. శరీరానికి ఇన్‌స్టాంట్ ఎనర్జీ అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ లెవల్స్ రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. వేసవిలో అలసట వంటి...
సత్తు పిండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆరోగ్యంపై పెరుగుతోన్న శ్రద్ధతో పట్టణాల్లో ఉంటున్న వారు కూడా సత్తు పిండిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో దీనిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటారు. బియ్యం, గోధుమలు లేదా జొన్నల నుంచి తయారు చేసే ఈ సత్తుపిండిలో ప్రోటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి.
తేలికగా జీర్ణమయ్యే ఈ ఆహారం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు అధితంగా ఉంటాయి. శరీరానికి ఇన్‌స్టాంట్ ఎనర్జీ అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని ఐరన్ లెవల్స్ రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. వేసవిలో అలసట వంటి సమస్యలకు వీటితో చెక్ పెట్టొచ్చు. అయితే ఇన్ని మంచి గుణాలు ఉన్న సత్తు పిండిని అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేరు సత్తు పిండికి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సత్తులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్, కడుపులో తిమ్మిరి, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* కిడ్నీల్లో రాళ్ల సమస్యలు ఉన్న వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో సత్తు పిండికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రాళ్ల సమస్య ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
* ఇక అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా సత్తును ఎక్కువ మోతాదులో తాగకూడదు ఎందుకంటే ఇది జీర్ణం కావడం కొంచెం కష్టమవుతుంది. అసలే కొంతమందికి సత్తిని కూడా సరిగా జీర్ణించుకోలేరు. అలాంటి వారికి ఇది హానికరమని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..