AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాను ఎవరూ శాసించలేరు… ఆ శకం అంతమైంది… కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల్లో అధ్యక్ధుడు జీ జిన్ పింగ్

సామ్రాజ్యవాద వేధింపులు, బెదిరింపుల నుంచి బయట పడి తమ దేశం అత్యంత ఉన్నతమైన దేశంగా ఎదిగిందని, దీన్ని ఎవరూ శాసించజాలరని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు.

చైనాను ఎవరూ శాసించలేరు... ఆ శకం అంతమైంది... కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల్లో అధ్యక్ధుడు జీ జిన్ పింగ్
China President Xi Jinping
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 01, 2021 | 1:25 PM

Share

సామ్రాజ్యవాద వేధింపులు, బెదిరింపుల నుంచి బయట పడి తమ దేశం అత్యంత ఉన్నతమైన దేశంగా ఎదిగిందని, దీన్ని ఎవరూ శాసించజాలరని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అన్నారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం టియానన్మెన్ స్క్వెర్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ….గతంలో సామాజిక విప్లవ సాధనకు దేశం ఎన్నో యుధ్ధాల నుంచి ఆందోళనల వరకు కూడా చేస్తూ వచ్చిందని …కోట్లాది ప్రజలను పేదరికం నుంచి అభివృద్ధి పథం వైపు నడిపించి జాతీయ పునరుజ్జీవనానికి పార్టీ సైతం కృషి చేస్తూ వచ్చిందని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ప్రపంచ స్థాయిలో మిలిటరీని పటిష్టవంతం చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. మన సైనిక శక్తిని ఎవరూ అంచనా వేయలేని విధంగా తీర్చి దిద్దుతామన్నారు. లోగడ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాం.. ఎన్నో సవాళ్ళను దీటుగా ఎదుర్కోవడమే కాక….శాసించ గలిగాం.. నేడు చైనా బలోపేతమైన శక్తిగా ఎదిగింది.. ఇందుకు మన కమ్యూనిస్టు పార్టీ కృషి అపారం అని జీ జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. మన ప్రత్యర్థులనుంచి మనను మనం కాపాడుకోవడానికి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకున్నాం అని ఆయన పరోక్షంగా అమెరికా వంటి దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు.

కాగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీ లేనిదే నవ చైనా లేదు అంటూ సాగిన గీతాలాపనల మధ్య అత్యంత సంరంభంగా ఈ కార్యక్రమం సాగింది. జీ జిన్ పింగ్ పాలనకు అనేకమంది ప్రజలు కితాబునిచ్చారు. తమ మద్దతు జీ జిన్ పింగ్ కే అని ప్రకటించారు. అధ్యక్షుడు తమ దేశ సైనిక పాటవాన్ని ఎంతగా ప్రశంసించినా కరోనా వైరస్ ..లేదా కోవిద్ పాండమిక్ గురించి ప్రస్తావించకపోవడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇండియన్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌..

viral video: రెప్పపాటులో ప్రమాదం..కానిస్టేబుల్‌ చాకచక్యంతో తృటిలో తప్పిన ముప్పు

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..