AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: రెప్పపాటులో ప్రమాదం..కానిస్టేబుల్‌ చాకచక్యంతో తృటిలో తప్పిన ముప్పు

ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం...  ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. మరి ముఖ్యంగా కదులుతోన్న ట్రైన్‌లో ఎక్కడం చాలా ప్రమాదకరం..

viral video: రెప్పపాటులో ప్రమాదం..కానిస్టేబుల్‌ చాకచక్యంతో తృటిలో తప్పిన ముప్పు
Running Train
Rajeev Rayala
|

Updated on: Jul 02, 2021 | 11:28 AM

Share

viral video: ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం…  ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. మరి ముఖ్యంగా కదులుతోన్న ట్రైన్‌లో ఎక్కడం చాలా ప్రమాదకరం.. అలాగే దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.. ఏ మాత్రం పొరపాటు జరిగిన అంతే సంగతులు. భూమ్మీద నూకలుంటే తప్ప ఇలాంటి ప్రమాదాల నుంచి బ్రతికి బయటపడలేం. తాజాగా ఓ వ్యక్తి ప్రమాదం అంచుల వరకు వెళ్లి వచ్చాడు. వేగంగా కదులుతున్న ట్రైన్‌ను ఎక్కేందకు ప్రయత్నిస్తూ, కిందపడిపోయాడు. అప్పటికే ట్రైన్‌ వేగంగా వెళ్తుండటంతో పట్టుతప్పి కిందపడి ఆ ట్రైన్‌ కిందకు వెళ్లబోయాడు ప్రయాణికుడు. ఓ కాలు ఫ్లాట్‌ఫామ్‌ కింద, మరో కాలు ఫ్లాట్‌ఫామ్‌పైన పడిపోయి అలాగే ఉండిపోయాడు.వెంటనే ఆ ప్రయాణికుడిని గమనించిన ఓ ఆర్ఫీఎఫ్‌ కానిస్టేబుల్‌, అతడిని సాహసోతపేతంగా కాపాడాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని పక్కకు లాగేసాడు. దాంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఎంతో సాహసోపేతంగా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అందరూ ప్రశంసిస్తూ, శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇది ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ వీడియోను మీరూ వీక్షించండి.

మరిన్ని ఇక్కడ చదవంది :

Samsung Galaxy F22 : జూలై 6న లాంచ్ అవుతున్న ‘శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 22’.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..

Twitter Down : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. సరిగా పనిచేయడం లేదని వినియోగదారుల ఆందోళన..

Google: గూగుల్‌కు 27,700 ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు.. నెలవారీ నివేదిక విడుదల