Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy F22 : జూలై 6న లాంచ్ అవుతున్న ‘శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 22’.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..

Samsung Galaxy F22 : కరోనా వల్ల ఉద్యోగులందరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. విద్యార్థులందరు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి

Samsung Galaxy F22 : జూలై 6న లాంచ్ అవుతున్న 'శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 22'..  తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు..
Samsung Galaxy F22
Follow us
uppula Raju

|

Updated on: Jul 01, 2021 | 11:57 AM

Samsung Galaxy F22 : కరోనా వల్ల ఉద్యోగులందరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. విద్యార్థులందరు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. దీంతో ప్రతి ఒక్కరికి సెల్‌ఫోన్ అత్యవసరమైంది. దీంతో చాలామంది బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారు. సరైన సమయంలో దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ భారతదేశంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు గెలాక్సీ ఎఫ్ 22 . దీని ధర 15 వేల రూపాయల కంటే తక్కువగా ఉంటుందని అందరు భావిస్తున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం జూలై 6న ఇండియాలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్‌కి సంబంధించి ఫీచర్లు, ఇతర విభాగాలు ఎలా ఉంటాయో ఒక్కసారి తెలుసుకుందాం.

1. గెలాక్సీ ఎఫ్ 22 స్మార్ట్‌ఫోన్ ఉత్తమ పనితీరు కోసం దీనికి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే. స్క్రీన్ రిజల్యూషన్ 1600 × 900 పిక్సెల్స్. ఈ శామ్‌సంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది.

2. మీడియాటెక్ హెలియో జి 80 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 జి వేరియంట్‌ను కూడా కంపెనీ అందించగలదు. దీనిలో మెరుగైన రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది.

3. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను దాని 5 జి వేరియంట్‌లో ఇవ్వవచ్చు. గెలాక్సీ ఎఫ్ 22 ను 6 జిబి, 8 జిబి ర్యామ్ ఆప్షన్లతో పాటు 128 జిబి స్టోరేజ్ ఆప్షన్ లో కూడా ఇవ్వవచ్చు.

4. ఈ ఫోన్ బ్యాటరీ 6000 mAh. కెమెరా గురించి మాట్లాడితే ఉత్తమ షాట్లను తీయడానికి వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ కెమెరాతో క్వాడ్ కెమెరా, 13 మెగాపిక్సెల్ కెమెరాను ముందు భాగంలో ఇవ్వవచ్చు.

5. గెలాక్సీ ఎఫ్ అనేది శామ్‌సంగ్ ఇండియా-స్పెసిఫిక్ స్మార్ట్‌ఫోన్ సిరీస్. దీని కోసం శామ్‌సంగ్ ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టింది. గెలాక్సీ ఎఫ్ స్మార్ట్‌ఫోన్‌లను శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్, ప్రధాన రిటైల్ దుకాణాల్లో విక్రయిస్తున్నారు. గెలాక్సీ ఎఫ్ -62, గెలాక్సీ ఎఫ్ -12, గెలాక్సీ ఎఫ్ -02 ఎస్ సహా శామ్‌సంగ్ ఈ ఏడాది భారతదేశంలో గెలాక్సీ ఎఫ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని విడుదల చేసింది.

Ttwitter Down : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. సరిగా పనిచేయడం లేదని వినియోగదారుల ఆందోళన..

Google: గూగుల్‌కు 27,700 ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు.. నెలవారీ నివేదిక విడుదల

Xiaomi Mi 12: 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 895 ప్రాసెసర్‌..!